AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Password: ఈ పాస్‌వర్డ్‌లను మీ బ్యాంకు అకౌంట్లకి ఉపయోగిస్తున్నారా..? మీ కొంప కొల్లేరైనట్లే.. వెంటనే మార్చుకోండి..

డిజిటల్ యుగంలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది తెలియక, మరికొంతమంది తెలిసి కూడా సైబర్ బాధితులుగా మారుతున్నారు. చిన్నచిన్న పొరపాట్లతో లక్షలాది రూపాయలను పొగొట్టుకుంటున్నారు.

Password: ఈ పాస్‌వర్డ్‌లను మీ బ్యాంకు అకౌంట్లకి ఉపయోగిస్తున్నారా..? మీ కొంప కొల్లేరైనట్లే.. వెంటనే మార్చుకోండి..
Password
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2022 | 5:42 PM

Share

డిజిటల్ యుగంలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది తెలియక, మరికొంతమంది తెలిసి కూడా సైబర్ బాధితులుగా మారుతున్నారు. చిన్నచిన్న పొరపాట్లతో లక్షలాది రూపాయలను పొగొట్టుకుంటున్నారు. ఆధునిక కాలంలో స్మార్ట్‌గా ఉండేందుకు ఎన్నో అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కోసారి మనం ఎంచుకున్న పాస్‌వర్డ్.. మన కొంప ముంచుతుందని ఓ అధ్యయనం హెచ్చరించింది. సాధారణంగా కష్టపడి సంపాదించిన డబ్బు, వ్యక్తిగత వివరాలు లేదా ఖరీదైన ఆభరణాలను ఎక్కడ సేవ్ చేస్తారు? బహుశా చాలా సురక్షితమైన ప్రదేశం లేదా లాకర్‌, ఇంకా బ్యాంక్ అకౌంట్లు లాంటి రహస్యమైన ప్రదేశాల్లో ఉంచుతారు. అయితే, రహస్యమైన ప్రదేశంలో ఉంచేటప్పుడు భద్రత గురించి ఆలోచిస్తారు. కానీ.. పాస్ వర్డ్ గురించి పెద్దగా ఆలోచించరని పేర్కొంది. నంబర్లతోపాటు పాస్‌వర్డ్‌ను పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తుంటారు. డిజిటల్ ప్రపంచంలో తరచూ జరిగే పొరపాటు ఇదేనని.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తమ ఆస్తుల భద్రతను నిర్ణయించే సమయంలో పాస్‌వర్డ్ గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించరని నార్డ్ పాస్ అనే నివేదిక తెలిపింది.

బలమైన పాస్‌వర్డ్ లేకపోవడం వల్ల చాలామంది మోసపోతున్నారని NordPass ఇటీవలి నివేదికలో తెలిపింది. 34 లక్షల మంది భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా 49 లక్షల మంది తమ పాస్‌వర్డ్‌గా.. password ను ఉపయోగిస్తున్నారని సూచించింది. ఇలాంటి పాస్‌వర్డ్ ల వల్ల ఖాతాలోకి ప్రవేశించి, అన్నింటినీ దొంగిలించడానికి హ్యాకర్‌కి సెకన కంటే తక్కువ సమయమే పడుతుందని తెలిపింది. పాస్‌వర్డ్ సులువుగా ఉండాలనుకుని.. అలసత్వం వహించే వారందరికీ ఇది మేల్కొలుపు అంటూ హెచ్చిరించింది.

భారతదేశంలోని మొదటి ఐదు పాస్‌వర్డ్‌లు..

భారతదేశంలో 3.4 మిలియన్లకు పైగా భారతీయులు ఉపయోగించే పాస్‌వర్డ్.. “password” అని నార్డ్‌పాస్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పాస్‌వర్డ్‌నే ఉపయోగిస్తున్నారని తెలిపింది. దీంతోపాటు ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్.. 123456 అని పేర్కొంది. అత్యంత విస్తృతంగా ఉపయోగించే రెండవ పాస్‌వర్డ్ 1245678, కాగా.. మూడవ పాస్‌వర్డ్ 123456789 అని పేర్కొంది. ఈ పాస్‌వర్డ్‌ అకౌంట్లన్నీ బలహీనమైనవని.. మోసపోయే అవకాశం ఉందని తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫుడ్ డెలివరీ స్టార్టప్ అయిన bigbasket 75,000 మంది భారతీయులు ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌లలో నాల్గవ స్థానంలో ఉందని తెలిపింది. NordPass నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వ్యక్తులు తమ పాస్‌వర్డ్‌ను చాలా సాధారణమైనదిగా, స్పష్టంగా ఉంచుకునేలా చూసుకుంటున్నారని.. ఇది మోసపోయేలా చేస్తుందని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

బలమైన పాస్‌వర్డ్‌ల కోసం చిట్కాలు..

  • భద్రతా ప్రమాణాల ప్రకారం.. పాస్‌వర్డ్‌లను సెట్ చేసేటప్పుడు ప్రజలు రెండు విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి..
  • ప్రతీ నెలకొకసారి తప్పనిసరిగా తమ పాస్‌వర్డ్‌లను తరచుగా మార్చుతుండాలి.
  • ఎప్పుడూ అన్ని ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించకూడదు.
  • పాస్‌వర్డ్‌లను సింపుల్‌గా ఉంచడం చాలా అవసరం అయితే.. అవి చాలా స్పష్టంగా ఉండకూడదు.
  • ఇంకా పేర్లను కూడా పాస్వర్డ్ గా పెట్టుకోకూడదు.
  • నంబర్లు, అక్షరాలతో పాటు స్పెషల్ కీస్‌ను కూడా పాస్‌వర్డ్‌లో ఎంటర్ చేయడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..