Hyderabad: భాగ్యనగరంలో మరోసారి కాల్పుల కలకలం.. బంగారం షాపులోకి ప్రవేశించి..
హైదరాబాద్ నగరంలో మరోసారి తుపాకీ పేలింది. నాగోల్ స్నేహపురి కాలనీలో కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. ఓ బంగారు షాపులోకి వచ్చిన ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపి షాప్ యజమానిని బెదిరించారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి తుపాకీ పేలింది. నాగోల్ స్నేహపురి కాలనీలో కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. ఓ బంగారు షాపులోకి వచ్చిన ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపి షాప్ యజమానిని బెదిరించారు. దుకాణంలోని బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక వివరాలను సేకరించి దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా ఇటీవల నగరంలో వరుసగా కాల్పులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలో మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. కాగ నాగోల్ కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..