AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. బయటపడ్డ కంత్రీమామ కతలు.. చిన్నారిని సేవ్ చేసిన పోలీసులు..

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం. ఫలక్‌నుమా ఏరియాలో ఓ చిన్నారిని అమానుషంగా హింసించిన కంత్రీ మామ నిర్వాకం కలకలం రేపింది.

Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం.. బయటపడ్డ కంత్రీమామ కతలు.. చిన్నారిని సేవ్ చేసిన పోలీసులు..
girl student
Shiva Prajapati
|

Updated on: Dec 01, 2022 | 9:13 PM

Share

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం. ఫలక్‌నుమా ఏరియాలో ఓ చిన్నారిని అమానుషంగా హింసించిన కంత్రీ మామ నిర్వాకం కలకలం రేపింది. తండ్రిగా ఆదరించాల్సిన వాడే రాక్షసంగా హింసించాడు. ఒళ్లంతా వాతలు పెట్టాడు. బంధువే రాబందువయ్యాడు. కానీ స్పందించే హృదయం ఆ చిన్నారిని సేఫ్‌ హ్యాండ్స్‌కు చేర్చింది. చకంత్రీ మామ చెర నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు సౌత్‌ జోన్‌ పోలీసులు.

ఏ డాడీ అయినా సరే బిడ్డను ప్రాణంగా భావిస్తాడు.. కానీ అమ్మలేని లోకంలో బంగారు తల్లిని ఒంటరిగా వదిలేసి ఎటో వెళ్లిపోయాడు నాన్న. రోడ్డున పడిన ఆ పసిబిడ్డను ప్రేమించే హృదయం అక్కున చేర్చుకుంది. బేటా మై హునా అంటూ భరోసా ఇచ్చిన ఆ అభయహస్తమే మేనమామ. తండ్రి తరువాత తండ్రి అన్న మాటను నిజం చేశాడని అంతా భావించారు. కట్‌ చేస్తే.. హైదరాబాద్‌ పాతబస్తీలో కలకలం రేపింది ఈ అమానుషం. బిడ్డకాలికి ముల్లు తగిలితేనే కన్నవాళ్ల గుండె కన్నీరవుద్ది. అలాంటిది ఒళ్లంతా కాల్చిన వాతలు.. పాపం.. బిడ్డ ఎంత తల్లడిల్లివుంటుందో. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే .. ఇలా అమానుషంగా ఈ చిన్నారిని హింసించారు.

హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీ ఫలక్‌నుమాలో ఈ దారుణం వెలుగుచూసింది. తల్లి అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి ఎటో వెళ్లిపోయాడు. ఒంటరిగా మారిన చిన్నారిని మేనమామ చేరదీస్తే అంతా సంతోషించారు. అభినందించారు. కానీ అతను తీసుకెళ్లింది ప్రేమతో కాదనే నిజానికి ఈ గాయాలే నిదర్శనం. అతను తీసుకెళ్లి చదివించి..పెద్ద చేయడానికి కాదు తన ఇంట్లో చాకిరీ చేయించుకోవడానికి. బిడ్డ ప్రాణం ఎంత.. అని కూడా చూడకుండా పనులు చెప్పడమే కాదు.. ఇలా హింసించేవాళ్లు.

ఇవి కూడా చదవండి

ఏడిస్తే ఓదర్చాడానికి అమ్మలేదు.. నాన్న ఉన్నా అతని జాడ లేదు.. ఎవరికి చెప్పుకోలేక.. ఏం చేయలేక నరకయాతన పడింది బిడ్డ. మేనమామ నిర్వాకం పై ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సౌత్‌ జోన్‌ డీసీపీ సాయి చైతన్య.. వెంటనే రియాక్టయ్యారు. ఓ స్వచ్చంద ప్రతినిధులతో కలిసి స్పాట్‌కు చేరుకున్నారు. మేనమామ కబంధ హస్తాల నుంచి ఈ బిడ్డను రెస్క్యూ చేశారు. చైల్డ్‌హోమ్‌కు తరలించారు. చిన్నారిని హింసిచన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసులు సకాలంలో స్పందించడంతో చిన్నారిని కాపాడగలిగామన్నారు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు. నిందితులను శిక్షించడం సహా ప్రభుత్వం ఆచిన్నారిని ఆదుకోవాలని కోరారు. తండ్రి తరువాత తండ్రిలా అండగా వుండాల్సిన వాడే ఇలా అరాచకానికి పాల్పడ్డం అందర్నీ నివ్వెరపర్చింది. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు స్థానికులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
గోవా వెళ్లేవారికి రిలీఫ్.. తగ్గనున్న ప్రయాణం
గోవా వెళ్లేవారికి రిలీఫ్.. తగ్గనున్న ప్రయాణం
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..