AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: పాలకూర, పనీర్ కలిపి తింటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాలంటున్న నిపుణుల ఏమంటున్నారంటే..

కలిసి తినకూడని అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగును పప్పులతో కలిపి తినకూడదు. అలాగే..

Health Alert: పాలకూర, పనీర్ కలిపి తింటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాలంటున్న నిపుణుల ఏమంటున్నారంటే..
Spinach And Paneer
Sanjay Kasula
|

Updated on: Dec 03, 2022 | 9:49 AM

Share

మనకు తెలియకుండానే కొన్నింటిని కలిపి తింటుంటాం. అలా అస్సలు తినొద్దని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఎందుకు వద్దని అంటున్నారో మనకు తెలియదు. వాటిని తింటే ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు. వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఫక్షన్లలో, చపాతీతో కలిపి పాలక్ పన్నీను లాగిస్తుంటాం. అయితే ఈ పాలకూర, పనీర్‌ను కలిపి తినకూడదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణుడు న్మామి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలలో ఒకదానిలో దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదని అగర్వాల్ అంటున్నారు. అంటే సరైన ఆహారాన్ని సరైన కాంబినేషన్‌లో తినడం. కొన్ని కాంబినేషన్లు ఉన్నాయని, వీటిని కలిపి తింటే ఒకదానిలోని పోషకాలు మరొకదానితో చెక్ పెట్టినట్లుగా మారుతుందని అంటున్నారు. ఎందుకు పాలక్ పన్నీర్ తినొద్దని అంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పనీర్, పాలకూరతో తినకూడదా..?

క్యాల్షియం, ఐరన్ ఈ రెండిటి కలయికను అసహజ కలయిక అని సూచిస్తున్నారు. పాలకూరలో ఐరన్ ఉంటుందనే విషయం మనకు తెలుసు. అలాగే పన్నీర్‌.. పాల నుంచి తయారు చేస్తారు. ఇందులో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. కానీ, క్యాల్షియం అన్నది ఐరన్‌ను మన శరీరం తీసుకోకుండా అడ్డుపడుతుంది. అంటే పన్నీరులో ఉండే క్యాల్షియం పాలకూరలో లభించే ఐరన్ ను మన శరీరంకు అందకుండా చేస్తుంది. కనుక పాలక్ పన్నీర్ కలిపి తీసుకున్నప్పుడు పాలకూరలో ఉండే ఐరన్ మన శరీరానికి అందకుండా పన్నీర్ లోని క్యాల్షియం బ్రేకులు వేస్తుంది. అందుకే ఐరన్‌తో కాల్షియం తీసుకోకూడదు. అదే పాలకూర-బంగాళదుంప లేదా పాలకూర-మొక్కజొన్న అంటే కార్న్ తీసుకోవచ్చని.. ఇందులో గరిష్టంగా ఇనుము ఇందులో లభిస్తుంది.

ఆహారంతో పాటు టీ త్రాగకూడదా..?

అదే సమయంలో, పోషకాహార నిపుణులు కూడా దీనిపై అంగీకరించారు. ఈ రెండింటిని కలిపి తినకూడదని సూచిస్తున్నారు. అలాగే, పాలు, టీ, కాఫీతోపటు ఇతర పాల ఉత్పత్తులతో ఐరన్ సప్లిమెంట్లను తీసుకోరాదని అంటున్నారు. ఆహారంతో పాటు టీ కూడా తీసుకోకూడదు.

పెరుగును పప్పుతో కలిపి తినకూడదా..?

కందిపప్పు, బీన్స్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పెరుగును మునపప్పు, కిడ్నీ బీన్స్‌, ఇతర పప్పులతో కలిపి తినకూడదని సూచించారు. ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర,పనీర్‌  కలిపి తినకూడదు. ఫిట్‌నెస్, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ సిద్ధాంత్ భార్గవ కూడా అగర్వాల్‌తో ఏకీభవించారు. పాలకూర-పనీర్ సరైన కలయిక కాదని అంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!