Dental Care: దంతాలు ఆరోగ్యంగా, మిలమిలా మెరవాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసమే..

వ్యక్తిగత శుభ్రతలో దంతాల ఆరోగ్యం చాలా ముఖ్యం. నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్, ఊపిరితిత్తుల సమస్యలు, అనేక ఇతర గుండె సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో తేలింది.

Dental Care: దంతాలు ఆరోగ్యంగా, మిలమిలా మెరవాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసమే..
Dental Care Tips
Follow us
Basha Shek

|

Updated on: Feb 09, 2023 | 10:08 AM

వ్యక్తిగత శుభ్రతలో దంతాల ఆరోగ్యం చాలా ముఖ్యం. మీ దంతాలను సూక్ష్మక్రిముల నుండి రక్షించడానికి మంచి నోటి పరిశుభ్రతను నిర్వహించడం చాలా ముఖ్యం. నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్, ఊపిరితిత్తుల సమస్యలు, అనేక ఇతర గుండె సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో తేలింది. ఇక దంతాలు శుభ్రంగా లేకపోతే చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పి, రక్తం రావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమస్యలను గుర్తించినప్పుడు తక్షణమే అప్రమత్తం కావాలి. మీ జీవన శైలి, అలవాట్లు మీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ఏ ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిందే. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల దంతాలలో పుచ్చు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన కూరగాయలు, ప్రోటీన్లు మీ నోటి ఆరోగ్యానికి మంచివి. మీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలను చేర్చడం కూడా మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటితో పాటు దంతాల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి.

ఈ చిట్కాలు తప్పనిసరి..

  • ప్రతి 6-8 నెలలకోసారి దంత పరీక్ష చేయించుకోవాలి.
  • చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాల వినియోగాన్ని తగ్గించండి. రోజుకు కనీసం 2 సార్లు బ్రష్ చేయండి. నాలుకను శుభ్రం చేసుకోవడం
  • మర్చిపోవద్దు.
  • ఆయుర్వేద లేదా రసాయన రహిత టూత్‌పేస్టులను ఉపయోగించండి. ప్రతి 3 నెలలకు మీ టూత్ బ్రష్‌ని కూడా మార్చండి.
  • ఒకసారి బఠానీ పరిమాణంలో టూత్‌పేస్ట్‌ను మాత్రమే వినియోగించాలి. టూత్‌పేస్ట్ ఎక్కువగా వాడటం వల్ల దంతాలు దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి.
  • ప్రతి భోజనం తర్వాత నోరు శుభ్రం చేసుకోండి. ఎందుకంటే ఆహారాలు మీ దంతాల మధ్య ఇరుక్కుపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి.
  • పొగాకు, సిగరెట్లకు దూరంగా ఉండండి.
  • దంత పరిశుభ్రతలో ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి.
  • నోటి నుండి ఆహార అవశేషాలను తొలగించడానికి మౌత్ వాష్ కూడా ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..