AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదలకుండా గంటల తరబడి అలాగే కూర్చుంటున్నారా? అయితే క్యాన్సర్ ముప్పు తప్పదు.. జాగ్రత్త!

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా మిలియన్ల కొంది మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.

కదలకుండా గంటల తరబడి అలాగే కూర్చుంటున్నారా? అయితే క్యాన్సర్ ముప్పు తప్పదు.. జాగ్రత్త!
Sedentary Cancer
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 01, 2023 | 8:00 AM

Share

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా మిలియన్ల కొంది మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. అయినప్పటికీ జీవితంలో వ్యాధి తీవ్రతను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేరు. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుందన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. మనం యాక్టివ్ గా ఉండకుండా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అది జీవక్రియ, దీర్ఘకాలిక మంట, హార్మోనల్లో మార్పులు, అధిక శరీర బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇటీవలి అధ్యయనాలు నిశ్చల ప్రవర్తన, క్యాన్సర్ ప్రాబల్యం మధ్య బలమైన లింక్ ను ఉన్నట్లు తేల్చాయి.

ఎక్కువ కూర్చోవం, కదలకపోవడాన్ని నిశ్చల ప్రవర్త అంటారు. నిశ్చల ప్రవర్తన కారణంగా కొలోరెక్టల్, ఎండోమెట్రియల్, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్ లను అభివ్రుద్ధి చేసే ప్రమాదం ఉందని ఇటీవలి అధ్యయనాలు కనుగొన్నాయి. నిశ్చల ప్రవర్తన క్యాన్సర్ వ్యాప్తికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. ఓ అధ్యయనం ప్రకారం ఎక్కువ కాలం నిశ్చలంగా ఉన్న సమూహంలో క్యాన్సర్ ప్రమాదం 13శాతం ఎక్కువగా ఉందని తేలింది. నిశ్చల సమయం మొత్తం క్యాన్సర్ ను పెంచుతుందని మరొక అధ్యయనం నివేదించింది.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ మరణాలు పెరగుతున్నట్లు నివేదించింది. క్యాన్సర్, రొమ్ము కొలొరెక్టల్, ఎండోమెట్రియల్, ఎపిథీలియల్ అండాశయ క్యాన్సర్ల మధ్య ముఖ్యమైన సంబంధం ఉంది. అంతేకాదు పెద్దప్రేగు క్యాన్సర్, ఎండో మెట్రియల్ క్యాన్సర్ తో సానుకూలంగా సంబంధం కలిగి ఉంది. లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా 30 నుంచి 40శాతం క్యాన్సర్ కేసులను నివారించవచ్చని డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

కదలకుండా కూర్చుండి గంటల తరబడి టీవీ వీక్షించే వారిలో పెద్దప్రేగు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రభావం చూపుతుందని…అధ్యయనం పేర్కొంది. టివీచూడటం, తియ్యటి పానీయాలు తాగడం, జంక్ ఫుడ్స్ తినడం కూడా ఈ క్యాన్సర్ కు కారణం అవుతుంది. శారీరకంగా చురుగ్గా ఉండటం, నిశ్చల సమయాన్ని తగ్గించడం వంటివి క్యాన్సర్ ను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సూచిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం