డెలివరీ తర్వాత స్త్రీలకు జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసా..?.. ఈ చిట్కాలు పాటించండి..

అలాగే, వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇది హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

డెలివరీ తర్వాత స్త్రీలకు జుట్టు ఎందుకు ఊడిపోతుందో తెలుసా..?.. ఈ చిట్కాలు పాటించండి..
Hair Fall
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 09, 2023 | 3:08 PM

ప్రస్తుతకాలంలో జుట్టు రాలే సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. అయితే, డెలివరీ అయిన మహిళ్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు అధిక జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అప్పటి వరకు ఒత్తుగా, పొడవుగా ఉండే జుట్టు.. డెలివరీ తర్వాత ఊడిపోవటం చూసి కొందరు మహిళలు భయపడి పోతుంటారు. కానీ, ఈ సమస్యతో అంతగా భయపడాల్సిన పనిలేదు. ఇది పూర్తిగా సాధారణం. గర్భధారణకు ముందు, డెలివరీ తర్వాత మీ జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే హార్మోన్ హెచ్చు తగ్గుల కారణంగా కొందరు మహిళ్లలో ఇలా జరుగుతుంటుంది. కానీ, ఇది శాశ్వత సమస్య మాత్రం కాదు..ప్రసవం తర్వాత మొదటి కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు యధాస్థితికి చేరుకుంటుంది.

గర్భధారణ తర్వాత శరీరాన్ని తిరిగి బలోపేతం చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రసవానంతర మహిళలు, ముఖ్యంగా, విటమిన్లు , మినరల్స్ సమృద్ధిగా ఉన్న పోషకాహారాన్ని తినాలి. ప్రసవానంతర జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడంలో ఇవి చాలా సహాయపడతాయి. అలాగే, హైడ్రేటెడ్‌గా ఉండటానికి రోజంతా పుష్కలంగా ద్రవాలను తీసుకోవటం ఉత్తమం. అలాగే, వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మెడిటేషన్ చెయ్యడం వలన ఒత్తిడిని దూరం చేసుకో వచ్చు. ఇది హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

డెలివరీ తర్వాత మీరు ఎక్కువ పోషక పదార్ధాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే జుట్టు రాలి పోవడం సమస్య తగ్గిపోతుంది. ఆకు కూరలు, చిలగడదుంపలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది..ఆహారంతో పాటుగా హెయిర్ కేర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా మంచి పద్దతి. ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, మంచి నిద్ర పొందడం కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?