AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీకు విపరీతంగా చెమట పడుతోందా.. అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఆ ప్రాబ్లం ఉండొచ్చు బీ అలర్ట్..

శరీరం దాని సహజ ఉష్ణోగ్రతను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా తల తిరగడం, చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రిపూట కూడా చెమట పడుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయమే.

Health: మీకు విపరీతంగా చెమట పడుతోందా.. అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఆ ప్రాబ్లం ఉండొచ్చు బీ అలర్ట్..
Sweating
Jyothi Gadda
|

Updated on: Feb 08, 2023 | 9:57 PM

Share

అలసిపోయినప్పుడు, శక్తికి మించి పని చేసినప్పుడు శరీరానికి చెమట పడుతుంది. వేసవి కాలంలో ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంటుంది. మరోవైపు.. మధుమేహం అనేది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యగా మారింది. మధుమేహంపై ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు.. ప్రస్తుతం మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. అధికంగా చెమట పట్టడానికి, మధుమేహం వ్యాధికి మధ్య సంబంధం ఉందని తేల్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో 422 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. దీనితో పాటు మధుమేహం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏటా దాదాపు 15 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం మధుమేహ బాధితులలో 17 శాతం మంది భారతదేశంలోనే ఉండటం ఆందోళన కలిగించే విషయం. అంటే భారతదేశంలో 8 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.

ఈ గణాంకాల ప్రకారం.. 2045 నాటికి భారతదేశంలో 13.5 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు అవుతారు. డయాబెటీస్ లక్షణాలలో చెమట పట్టడం లేదు. కానీ మధుమేహం తర్వాత చాలా మందిలో చెమట సమస్య కనిపిస్తోంది. డయాబెటిస్‌లో శరీరం దాని సహజ ఉష్ణోగ్రతను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా తల తిరగడం, చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రిపూట కూడా చెమట పడుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయమే. రక్తంలో చక్కెర లెవెల్స్ బ్యాలెన్సింగ్ గా లేనప్పుడు అధిక చెమట ఏర్పడుతుంది. కొంతమందికి పాదాలు లేదా తొడలలో చెమట పడుతుంది.

ఒక పరిశోధన ప్రకారం.. మధుమేహంతో బాధపడుతున్న వారిలో 84 శాతం మంది అధిక చెమటతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర శాతం తగ్గడమే దీనికి ప్రధాన కారణం. మధుమేహ రోగులు రక్తంలో చక్కెరను తగ్గించడానికి మందులు తీసుకుంటారు. ఈ ఔషధం తీసుకోవడం వల్ల చక్కెర శోషణ వేగంగా స్టార్ట్ అవుతుంది. మధుమేహం కారణంగా స్వీట్లు తినడం పూర్తిగా మానేసినా.. శరీరంలో చక్కెర లేదా గ్లూకోజ్ కొరత ఏర్పడుతుంది. ఈ సమయంలోనూ ఎక్కువగా చెమట పడుతుంది. కాబట్టి చెమట పట్టడాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.