యజమాని హత్య.. ఒంటెను చెట్టుకు కట్టేసి చంపిన గ్రామస్తులు..

గ్రామస్తులు కొట్టిన దెబ్బలకు ఆ ఒంటె మరణించింది. గ్రామస్థులు ఒంటెను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

యజమాని హత్య.. ఒంటెను చెట్టుకు కట్టేసి చంపిన గ్రామస్తులు..
Agitated Camel
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 08, 2023 | 9:26 PM

కోపంతో ఊగిపోయిన ఒక ఒంటె దాని యజమానిని చంపింది. దాంతో మరింత కోపంతో రగిలిపోయిన గ్రామస్థులు ఆ ఒంటెను చెట్టుకు కట్టేసి చంపేశారు.. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఒంటె యజమానిని తొక్కి చంపిన ఘటన సోమవారం సాయంత్రం బిక్నేర్‌లోని పంచు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పంచు పోలీస్ స్టేషన్ హెడ్ మనోజ్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు..యజమానిని చంపిన ఒంటెను గ్రామంలో కట్టివేసినట్లు తెలిపారు. అదే సమయంలో అటుగా వెళుతున్న మరో ఒంటెను చూసి ఈ ఒంటె దాన్ని కట్టేసిన స్తంభాన్ని విరగ్గొట్టుకుని దూరంగా కనిపించిన ఒంటెవైపు పరుగెత్తింది. ఈ సమయంలో ఒంటె యజమాని సోహన్‌రామ్ నాయక్ తన ఒంటెను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆ ఒంటె తన యజమానిపైనే దాడి చేసింది. ఒంటె తన యజమానిని మెడ పట్టుకుని పైకి లేపి నేలపైకి విసిరి కొట్టింది. అతని తల నమిలేసిందని చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న సోహన్ రామ్ నాయక్ కుటుంబీకులు ఎలాగోలా ఒంటెను అదుపు చేశారు. తీవ్ర ఆగ్రహంతో, ఆందోళన చెందిన ఒంటెను గ్రామస్థులు సమీపంలోని చెట్టుకు కట్టేశారు. అది తేరుకున్న తర్వాత దాన్ని విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారు. గ్రామస్తులు కొట్టిన దెబ్బలకు ఆ ఒంటె మరణించింది. గ్రామస్థులు ఒంటెను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

ఒంటె రాజస్థాన్ రాష్ట్ర జంతువు, రాష్ట్ర జంతువును చంపడానికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఒంటెచేతిలో హత్యకు గురైన సోహన్ రామ్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..