AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్‌ బందోబస్త్‌తో పెళ్లి ఊరేగింపు.. డ్రోన్‌ కెమెరాల నిఘాతో బరాత్‌.. ! ఎందుకో తెలుసా..?

పోలీసు బందోబస్తులో బ్యాండ్ వాయిద్యాలతో కవాతు నిర్వహించారు. పెళ్లి వేడుకను విజయవంతంగా ముగించిన తర్వాతే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు భద్రత మధ్య విజయవంతంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వధువు కవిత సంతోషంగా ఉంది.

పోలీస్‌ బందోబస్త్‌తో పెళ్లి ఊరేగింపు.. డ్రోన్‌ కెమెరాల నిఘాతో బరాత్‌.. ! ఎందుకో తెలుసా..?
Wedding
Jyothi Gadda
|

Updated on: Feb 08, 2023 | 8:30 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో దళిత కుటుంబానికి చెందిన యువతి వివాహ ఊరేగింపు పోలీసు భద్రతలో జరిగింది. గున్నూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఘుంగయ్య గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన పెళ్లి ఊరేగింపును పోలీసు రక్షణలో నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన షీలా అనే దళిత మహిళ కుమార్తె వివాహాన్ని అడ్డుకుంటామని రౌడీలు బెదిరించడంతో పోలీసులను రక్షణ కల్పించాలని కోరారు. అలీగఢ్ జిల్లాలోని గ్రామం నుంచి ఫిబ్రవరి 7న తన కుమార్తె పెళ్లి ఊరేగింపు జరగాల్సి ఉందని ఆ మహిళ తెలిపింది. తన కూతురు పెళ్లి ఊరేగింపులో అడ్డంకులు సృష్టించాలని గ్రామంలోని కొందరు దుండగులు బెదిరించారని చెప్పింది. దీంతో పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది.

మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ చక్రేష్ మిశ్రా బాధితురాలికి భరోసా కల్పించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె కూతురి పెళ్లి ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం నుంచి గ్రామమంతా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి గడపలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఊరేగింపు మంగళవారం అర్థరాత్రి అలీగఢ్‌ గ్రామానికి చేరుకుంది. అనంతరం బ్యాండు మేళాల నడుమ పోలీసు భద్రతతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సమయంలో ఊరేగింపు మొత్తం పోలీసుల రద్దీగా కనిపించింది. అంతే కాదు డ్రోన్ కెమెరాతో ఊరంతా పర్యవేక్షించారు. అంతేకాకుండా గ్రామంలో పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసు బందోబస్తులో బ్యాండ్ వాయిద్యాలతో కవాతు నిర్వహించారు. పెళ్లి వేడుకను విజయవంతంగా ముగించిన తర్వాతే పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు భద్రత మధ్య విజయవంతంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వధువు కవిత సంతోషంగా ఉంది. అదే సమయంలో ఫిర్యాదుదారుడి తల్లి షీలా, యోగి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

గత ఏడాది నవంబర్ 25న సంభాల్ జిల్లాలోని జునావాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహమై గ్రామంలో పోలీసు రక్షణలో దళిత కుటుంబానికి చెందిన పెళ్లి ఊరేగింపును సురక్షితంగా నిర్వహించారు. అయితే ఇప్పుడు గన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘుంగయ్య గ్రామంలో పెళ్లికూతుళ్ల ఊరేగింపుకు పోలీసులు పూర్తి భద్రత కల్పించారు. ఊరంతా ఈ పెళ్లి గురించే చర్చ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం