ప్రేమ నిజంగానే గుడ్డిది..! 85 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల అమ్మాయి.. 61ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌తో ఇప్పుడు పిల్లలు..!?

వీరి ప్రేమను మొదట్లో అందరూ వ్యతిరేకించారు.  తాత వయస్సున వ్యక్తితో ప్రేమేంటని మండిపడ్డారు.. కానీ, చివరకు కూతురు సంతోషం చూసి పెళ్లికి అంగీకరించారట.

ప్రేమ నిజంగానే గుడ్డిది..! 85 ఏళ్ల వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల అమ్మాయి.. 61ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌తో ఇప్పుడు పిల్లలు..!?
Age Gap
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 08, 2023 | 6:16 PM

గతంలో పెళ్లి అంటే ఇలాగే ఉండాలనే అలిఖిత నియమం ఉండేది. మగ, ఆడ మధ్య వయస్సు అంతరం గమనించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. స్త్రీ, పురుషులు ఇద్దరూ అంగీకరిస్తే చాలు.. ఎలాంటి అంతరాలు అడ్డుకావు. వయసు అంతరం కూడా కనిపించడం లేదు. ఒక అమ్మాయి తన కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని, అబ్బాయి తన కంటే చాలా పెద్దవారిని వివాహం చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే పెళ్లి విషయంలో స్త్రీ, పురుషుల అంగీకారం, ఇరు కుటుంబాల మధ్య సాంగత్యం ముందు వయసు అంతరం కనిపిస్తుంది. కొంత మంది ఏజ్ గ్యాప్‌తో ఏకీభవిస్తే, మరికొందరు ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండకూడదని అంటున్నారు. ఇది విభేదాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ కాలం మారింది. పిక్చర్-పర్ఫెక్ట్ రకమైన వివాహాలు ఇప్పుడు జరుగుతాయి. సాధారణంగా అమ్మమ్మకి మనవడి వయసు, తల్లికి కొడుకు వయసు, తండ్రికి కూతురు వయసు ఉన్నవారితో పెళ్లి చేయడాన్ని ఎవరూ అంగీకరించారు. కానీ, ఇక్కడ 24 ఏళ్ల మహిళ 85 ఏళ్ల వ్యక్తిలో ప్రేమలో పడింది. ఇప్పుడు ఈ జంట ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రేమకు కళ్లు లేవని, వయో పరిమితి లేదని వీరు నిరూపించారు.

Age Gap1

అమెరికాకు చెందిన చార్లెస్ పోగ్ 2019లో లాండ్రీగా పనిచేస్తున్న మిరాకిల్ పోగ్‌ని కలిశాడు. వీరి పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.. వధూవరుల మధ్య 61 ఏళ్ల వయసు గ్యాప్ ఉంది. అయితే ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పైగా వీరు తమ ప్రేమపెళ్లిని ఎలా సమర్ధించుకుంటున్నారంటే..’మేమిద్దరం మొదటిసారి కలిసినప్పుడు మా ఇద్దరికీ ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ చార్లెస్ నాకు రోజురోజుకు దగ్గరయ్యాడు. నేను వారితో సంతోషంగా ఉంటానని భావించాను. అందుకే ఏజ్ గ్యాప్ మర్చిపోయి పెళ్లి చేసుకున్నాను’ అంటూ మిరాకిల్ చెప్పారు. యువతి మిరాకిల్ తాత కంటే ఆమె భర్త చార్లెస్ పెద్దవాడన్న సంగతి తనకు ముందే తెలుసు.

2019లో లాండ్రోమాట్‌లో పనిచేస్తున్నప్పుడు 85ఏళ్ల చార్లెస్ పోగ్‌ని కలిశారు. చార్లెస్, రిటైర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, చివరకు వారు కలిసిన ఒక సంవత్సరం తర్వాత వారు తమ భావాలను పంచుకున్నారు. ఫిబ్రవరి 2020లో ప్రతిపాదించారు. చార్లెస్‌కు పిల్లలు లేరు. తనకు పిల్లలు కావాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వీరు ఈ జంట IVF ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు.

వీరి ప్రేమను మొదట్లో అందరూ వ్యతిరేకించారు.  మిరాకిల్‌ను చార్లెస్ ప్రేమిస్తున్నట్టు తెలిసిన తర్వాత.. ఆమె తల్లి తమికా ఫిలిప్స్, తాత జో బ్రౌన్ వివాహానికి అంగీకరించారని మిరాకిల్ చెప్పారు. అయితే ఈ పెళ్లికి ఆమె తండ్రి కరీం ఫిలిప్స్ సుతారమ్ ఇష్టపడటం లేదని సమాచారం. చివరకు కూతురు సంతోషం చూసి కరీం కూడా పెళ్లికి అంగీకరించాడట.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..