Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: నోటి చుట్టూ చర్మం నల్లగా మారిందా..? ఈ చిట్కాలను పాటించండి.. మీ ముఖం హీరోయిన్‌లా మారిపోతుంది..!

మీరు కూడా ఇలాంటి సమస్యతో పోరాడుతున్నట్లయితే చింతించవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోబోయే రెమీడి మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మిమ్మల్నీ పిగ్మెంటేషన్ సమస్య నుంచి ఈజీగా బయటపడేలా చేస్తుంది.

Skin Care Tips: నోటి చుట్టూ చర్మం నల్లగా మారిందా..? ఈ చిట్కాలను పాటించండి.. మీ ముఖం హీరోయిన్‌లా మారిపోతుంది..!
Pigmentation Around The Mou
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 08, 2023 | 3:56 PM

నోటి చుట్టూ పిగ్మెంటేషన్: చాలా మంది వ్యక్తుల నోటి చుట్టూ చర్మం నల్లగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇవి పిగ్మెంటేషన్ సంకేతాలు కావచ్చు. నోటి చుట్టూ చర్మం నల్లగా ఉన్నప్పుడు, మీ ముఖం కూడా నిర్జీవంగా కనిపిస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో పోరాడుతున్నట్లయితే చింతించవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోబోయే రెమీడి మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మిమ్మల్నీ పిగ్మెంటేషన్ సమస్య నుంచి ఈజీగా బయటపడేలా చేస్తుంది. అందుకోసం ఏం చేయాలంటే..

బంగాళదుంప రసం: నోటి చుట్టూ ఉన్న చర్మం నల్లగా మారినట్లయితే మీరు బంగాళాదుంప రసాన్ని ఉపయోగించవచ్చు. బంగాళాదుంప ముక్కలను కట్ చేసి చర్మంపై అప్లై చేసుకోవచ్చు. లేదంటే..బంగాళాదుంప రసాన్ని తీసి కాటన్ బాల్స్‌తో అద్దుకుని చర్మానికి రాసుకోవచ్చు. ఆ తర్వాత 15 నిమిషాల వరకు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది. బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి. ఇది చర్మంలోని నల్లదనాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

టమాటో రసం: నోటి చుట్టూ ఉన్న చర్మం ముఖంపై నల్లగా కనిపిస్తే, మీరు టొమాటో రసాన్ని అప్లై చేయవచ్చు. దీన్ని అప్లై చేయడానికి, ఒక గిన్నెలో టమోటా రసాన్ని తీసుకుని చర్మంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేయండి.. టొమాటోలో యాంటీ ఏజింగ్ ఉంటుంది. అందుకే దీన్ని ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ తదితర సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం: నిమ్మరసం నోటి చుట్టూ ఉండే చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. మరోవైపు ముఖంపై పిగ్మెంటేషన్ సంకేతాలు ఉంటే నిమ్మరసాన్ని నేరుగా ముఖంపై అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసం మరకలు, మచ్చలను తొలగిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉన్నాయి. కాబట్టి.. దీన్ని ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ క్లియర్ అవుతుంది.

రోజ్ వాటర్ : చర్మం ఆకృతిని మెరుగుపరచడానికి మీరు రోజ్ వాటర్ సహాయం తీసుకోవచ్చు. రోజ్ వాటర్ వల్ల చర్మంపై పెద్దగా సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కాటన్ సహాయంతో చర్మంపై రోజ్ వాటర్ అప్లై చేయండి. దీంతో ముఖాన్ని పూర్తిగా మసాజ్ చేయండి. ప్రతిరోజూ రోజ్ వాటర్ మసాజ్‌తో మీ ముఖం రంగులో మీకు తేడాను గమనిస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..