Transgender Couple: బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్ జంట.. దేశంలోనే తొలిసారిగా ఇలా..
జిహాద్ గర్భవతి అని తెలియగానే ఇద్దరూ సంతోషించారు. జిహాద్ మొదటి మూడు నెలల్లో గొప్ప శారీరక మార్పు గమనించింది. వాంతులు అతనిని అతలాకుతలం చేశాయి. ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. గర్భం దాల్చిన తర్వాత, జిహాద్ పనికి వెళ్లడం మానేశాడు.
కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించిన కేరళకు చెందిన లింగమార్పిడి దంపతులు జహాద్, జియా పావల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కోయిక్కోడ్ మెడికల్ కాలేజీలో.. గర్భవతి అయిన జియా పావల్ శస్త్రచికిత్స ద్వారా డెలివరీ అయింది. పాప లింగం ఇంకా వెల్లడి కాలేదు. దేశంలోనే మూడో లింగానికి బిడ్డ జన్మించడం ఇదే తొలిసారి. జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్‌జెండర్ దంపతులు కోయికోడ్ జిల్లా వాసులు. మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇతర లింగమార్పిడి కంటే భిన్నంగా ఉండాలనుకునే ఆమె ఒక బిడ్డను కనాలని ఆలోచించింది. లింగ పరివర్తన ప్రక్రియలో భాగంగా ఇద్దరూ హార్మోన్ థెరపీ చేయించుకున్నారు. ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. సర్జికల్ డెలివరీ తర్వాత తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, జియా పావల్‌కు డెలివరీ డేట్ మార్చిలో ఇచ్చారు. కానీ వైద్య కారణాల వల్ల తనకు ముందుగానే సర్జరీ చేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఇటీవలే లింగమార్పిడి జంట తల్లిదండ్రులం కాబోతున్నామంటూ బేబీ బంప్‌తో చేసిన ఫోటోషూట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లింగమార్పిడి ద్వారా వీరు ఒక్కటయ్యారు. కేరళకు జియా పావల్ శరీర పరివర్తన పొంది స్త్రీగా మారింది. జహాద్ ఆడపిల్లగా పుట్టి మగవాడిగా మారిపోయాడు. ఆడ నుంచి మగగా మారే క్రమంలో గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించకపోవడంతో జహాద్ గర్భం దాల్చింది. జియా క్లాసికల్ డ్యాన్స్ టీచర్ కాగా, జహాద్ కోయైకోడ్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్. ట్రాన్స్‌జెండర్లైనా అందరిలానే కూడా పిల్లల్ని కనాలని ఈ జంట కోరుకుంది. తన శరీరంలో గర్భసంచి ఇంకా ఉండడంతో.. ఐవీఎఫ్ విధానంతో గర్భం దాల్చాడు జహాద్.
జిహాద్ గర్భవతి అని తెలియగానే ఇద్దరూ సంతోషించారు. జిహాద్ మొదటి మూడు నెలల్లో గొప్ప శారీరక మార్పు గమనించింది. వాంతులు అతనిని అతలాకుతలం చేశాయి. ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. గర్భం దాల్చిన తర్వాత, జిహాద్ పనికి వెళ్లడం మానేశాడు. తన గురువు నడకవో ఓం స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌కి చెందిన డాక్టర్ హర్షన్ సెబాస్టియన్ ఆంథోని ఆధ్వర్యంలో వైద్యం సాగింది.. ప్రభుత్వం లేదా లింగమార్పిడి సంఘం తమకు సహాయం చేయాలని దంపతులు అభ్యర్థించారు.
ఆదుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. తమ బిడ్డ పెద్దయ్యాక ఎదురయ్యే సమస్యల గురించి ఆందోళన లేదంటున్నారు. కానీ, తమ బిడ్డ తమను అర్థం చేసుకుంటాడని అంటున్నారు. అది మనతోనే ఉంటుందనే నమ్మకం ఉంది. మన బిడ్డ ఈ సమాజంలో ఉన్నతంగా బతకాలని ఆ దంపతుల కోరిక. ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. బేబీ బంప్ ఫోటో షూట్ కూడా చేసి లీక్ చేశారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..