PM Modi: నిన్న పెద్ద పెద్ద మాటలు చెప్పిన నేతలు ఇవాళ కనిపించడం లేదు.. పార్లమెంట్ ప్రసంగంలో రాహుల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ..

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగానికి అడ్డుతగులాయి విపక్షాలు.

PM Modi: నిన్న పెద్ద పెద్ద మాటలు చెప్పిన నేతలు ఇవాళ కనిపించడం లేదు.. పార్లమెంట్ ప్రసంగంలో రాహుల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ..
PM Modi
Follow us

|

Updated on: Feb 08, 2023 | 5:07 PM

రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈసారి కృతజ్ఞతతో పాటు, రాష్ట్రపతిని కూడా అభినందించాలనుకుంటున్నాను. గణతంత్ర రాజ్యానికి అధినేత్రిగా రాష్ట్రపతి ఉనికి చారిత్రాత్మకమే కాదు.. దేశంలోని కోట్లాది మంది కుమార్తెలకు స్ఫూర్తిదాయకమైన గొప్ప అవకాశం కూడా అంటూ అభినందనలు తెలిపారు. ధన్యవాద తీర్మానంపై చర్చించినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అనంతరం,  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. ఇక్కడ జరిగిన చర్చలో ప్రతి ఒక్కరూ తమ సొంత గణాంకాలు, వాదనలు వినిపించారు. వారి ఆసక్తి, ధోరణి, స్వభావాన్ని బట్టి వారు చెప్పింది అర్థం చేసుకోవచ్చన్నారు. మకొందరు నేతలు నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి మనసులో విద్వేషాన్ని బయటపెట్టారంటూనే వాళ్లు ఇవాళ సభకు రాలేదని ఎద్దేవ చేశారు.

నేను నిన్న చూశాను. కొద్ది మంది ప్రసంగాలు ముగిశాక.. ‘యే హుయ్ నా బాత్’ అంటూ కొందరు ఆనందంగా మాట్లాడుతున్నారు. బహుశా వారు బాగా నిద్రపోయి ఉండవచ్చు.. సమయానికి మేల్కొనలేరు. వారి కోసం, “యే కెహ్ కెహ్ కే హమ్ దిల్ కో బెహ్లా రహే హై, వో అబ్ చల్ చుకే హై, వో అబ్ ఆ రహే హై” అని చెప్పండి అంటూ ఎద్దేవ చేశారు.

జీవితం అంటేనే సవాళ్లమయం.. ఆ సవాళ్లకంటే 140 కోట్ల దేశజనాభనే ముఖ్యం. అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్నంటాయి.. నిరుద్యోగం పెరిగిపోయింది. పొరుగుదేశాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది. ఇలాంటి సమయంలో భారత్ మాత్రం గర్వంగా నిలబడిందన్నారు. ప్రపంచమంతా భారత్ పై పాజిటివిటీ ఉందన్నారు. జీ 20కి అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు లభించింది. దీన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది ఎవరు భరించలేకపోతున్నారో అర్థం చేసుకోండి.. సంపూర్ణ మెజార్టీతో కూడిన నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ను నమ్మకంతో చూస్తున్నాయి. భారత్ సామర్థ్యం పెరుగుతుండటమే కారణం.. భారత్‌లో స్థిరత్వం ఉంది. స్థిరమైన ప్రభుత్వం ఉంది. దేశానికి కాలానుగుణంగా ఏంకావాలో అది అందిస్తున్నాం. కరోనా సమయంలో మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తయారు చేసి.. కోట్లాది మందికి ఉచితంగా టీకాలు అందించాం

ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని గారూ, ప్రజాస్వామ్య స్వరాన్ని మీరు చెరిపివేయలేరు అని అన్నారు. భారతదేశ ప్రజలు మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నారు. నాకు సమాధానం చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇదిలావుంటే, లోక్‌సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది.

ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..