Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Risk: భారత్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చే సంకేతాలు.. భూగర్భశాస్త్రవేత్తల హెచ్చరిక!

టర్కీ, సిరియాల్లో భూకంప తీవ్రతను చూసిన తర్వాత ఇంతకీ భారత్‌ సేఫేనా అనే డౌట్‌ వస్తోంది. దాదాపు 8 వేల మందిని బలిగొన్న ఘోర భూకంపం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై భూగర్భశాస్త్ర నిపుణులు స్పందిస్తూ.. భారత్‌లో దాదాపు 59 శాతం భూభాగం వివిధ కారణాల రిత్య తరచూ భూకంపాలకు..

Earthquake Risk: భారత్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చే సంకేతాలు.. భూగర్భశాస్త్రవేత్తల హెచ్చరిక!
Earthquake
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 08, 2023 | 2:46 PM

టర్కీ, సిరియాల్లో భూకంప తీవ్రతను చూసిన తర్వాత ఇంతకీ భారత్‌ సేఫేనా అనే డౌట్‌ వస్తోంది. దాదాపు 8 వేల మందిని బలిగొన్న ఘోర భూకంపం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై భూగర్భశాస్త్ర నిపుణులు స్పందిస్తూ.. భారత్‌లో దాదాపు 59 శాతం భూభాగం వివిధ కారణాల రిత్య తరచూ భూకంపాలకు గురవుతుంది. ముఖ్యంగా దక్షిణ భారత్‌ కన్నా ఉత్తర భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది. దేశంలోని సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం.. మొత్తం ప్రాంతాన్ని నాలుగు సీస్మిక్ జోన్‌లుగా వర్గీకరించినట్లు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ 2021 జులైలో లోక్‌సభలో తెలిపారు. జోన్ 5 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్‌గా ఆయన పేర్కొన్నారు. దేశం వైశాల్యంలో దాదాపు 11% జోన్ 5లో, 18% జోన్ 4లో, 30% జోన్ 3లో మిగిలినవి జోన్ 2లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత తీవ్రత కలిగిన భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో నార్త్‌ ఇండియాలోని హిమాలయాలు ఒకటి.

1934లో బీహార్-నేపాల్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 8.2గా నమోదైంది. ఈ ప్రమాదంలో దాదాపు పది వేల మంది మరణించారు. 1991లో ఉత్తరకాశీలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 800 మందికి పైగా మరణించారు. 2005లో కాశ్మీర్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 80,000 మంది మరణించారు. 2016నాటి అధ్యయనాల ప్రకారం మధ్య హిమాలయాల ప్రాంతంలో టెక్టోనిక్ పీడనం ఎక్కువగా ఉందని, ఇండో-ఆస్ట్రేలియన్, ఆసియా టెక్టోనిక్ ప్లేట్ల కలయిక భాగంలో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హిమాలయాల్లో గత 50 ఏళ్లుగా భారీ భూకంపం ఏదీ రాలేదు. కానీ భూమి లోపల ఫలకాల కదలిక జరుగుతూనే ఉంది. అందువల్ల పుట్టిన పీడనం బయటకు రాకుండా లోపలే ఉండటం వల్ల వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లు భూకంప పరిశోధనా కేంద్రం చీఫ్‌ సైంటిస్ట్‌ పూర్ణ చంద్రరావు తెలిపారు.

జోన్‌ 5లోని ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, జమ్మూ అండ్‌ కశ్మీర్, అండమాన్ అండ్‌ నికోబార్‌ ప్రాంతాల్లో భూకంపాలు ఓ క్షణానైనా సంభవించవచ్చనినేషనల్ సిస్మోలజీ సెంటర్‌ హెచ్చరిస్తోంది. ఢిల్లీని అత్యంత ప్రమాదకర ప్రాంతంగా నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.