Rakhi Sawant: నటి రాఖీ సావంత్ భర్త అరెస్ట్‌..! పెళ్లైన రెండు నెలలకే బిగ్‌ ట్విస్ట్‌..

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ రియాలిటీ స్టార్ రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీని ముంబై పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 7) అరెస్ట్‌ చేశారు. గతకొంతకాలంగా రాఖీ సావంత్ పెళ్లి ముచ్చట్లు..

Rakhi Sawant: నటి రాఖీ సావంత్ భర్త అరెస్ట్‌..! పెళ్లైన రెండు నెలలకే బిగ్‌ ట్విస్ట్‌..
Rakhi Sawant
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 08, 2023 | 9:45 AM

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ రియాలిటీ స్టార్ రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీని ముంబై పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 7) అరెస్ట్‌ చేశారు. గతకొంతకాలంగా రాఖీ సావంత్ పెళ్లి ముచ్చట్లు నెట్టింట పలువలు చిలువలుగా, కథకథలుగా చర్చిస్తున్న విషయం తెలిసిందే. ప్రేమ అనికాసేపు, ఆ వెంటనే పెళ్లయిపోయినట్లు కాసేపు రాఖీ సావంత్ ఇచ్చే ట్విస్టులు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మువీకి ఏ మాత్రం తీసిపోవు. ఇక పెళ్లి జరిగినట్లు ప్రకటించిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే భర్త వేధిస్తున్నాడని, విడాకులుకావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన భర్త ఆదిల్‌ దురానీ వేరే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడని, తనను మోసం చేసి డబ్బు, నగలు తీసుకున్నాడని ఆరోపిస్తూ ఓషివారా పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదిల్‌ దురానీ అరెస్ట్‌పై పోలీసులు అధికారికంగా ఇంకా ధ్రువీకరించనప్పటికీ రాఖీ సావంత్ మాత్రం ఆదిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని, బుధవారం కోర్టు ముందు హాజరు పరచనున్నారనే విషయాన్ని రచ్చకీడ్చింది.

ఈ సందర్భంగా రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ..’ఆదిల్‌ నన్ను కొట్టి, నాకు తెలియకుండా నా ఫ్లాట్‌లోని డబ్బు, నగలు తీసుకెళ్లాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతను నన్ను మోసం చేశాడు. నన్ను మానసికంగా హింసించాడు. ఆదిల్‌ ఇంత దిగజారీ పోతాడని అస్సలు ఊహించలేదు. పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్‌ చేశారు. తన తల్లి మరణానికి కూడా ఆదిల్ కారణం అంటూ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

కాగా ఆదిల్ ఖాన్‌తో ఈ ఏడాది జనవరిలో తన పెళ్లి జరిగినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేధికగా అఫీషియల్‌గా ప్రకటించింది. గతేడాది మే 29న వీరి పెళ్లి జరిగినట్లు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఇక ఆదిల్‌పై రాఖీ సావంత్ ఆరోపణలను ఆమె సోదరుడు కూడా బలపరిచాడు.

View this post on Instagram

A post shared by Telly Talk (@tellytalkindia)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి