TSPSC Group 4 Exam Date: జులై 1న తెలంగాణ గ్రూప్ 4 రాత పరీక్ష.. హాల్ టికెట్లు ఎప్పట్నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
తెలంగాణ గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (ఫిబ్రవరి 3)తో ముగిసింది. రాష్ట్రంలోని 8,180 టీఎస్పీయస్సీ గ్రూప్ 4 పోస్టులకు దాదాపు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు..
తెలంగాణ గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (ఫిబ్రవరి 3)తో ముగిసింది. రాష్ట్రంలోని 8,180 టీఎస్పీయస్సీ గ్రూప్ 4 పోస్టులకు దాదాపు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 116 మంది పోటీపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4కు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2018లో 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు. గ్రూప్ 4 పోస్టులకు ఈ ఏడాది జులై 1న రెండు పేపర్లకు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల నుంచి 30 నిముషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు.
కాగా 581 వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేయనున్న 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 2930 దరఖాస్తులు వచ్చాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.