డీజిల్‌ దిగుమతిపై నిషేధం.. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు సరికొత్త స్కెచ్‌!

రష్యా నుంచి దిగుమతి అయ్యే డీజిల్, ఇతర చమురు ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ఆదివారం (ఫిబ్రవరి 5) యూరప్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై వరుస దాడుల దృష్ట్యా రష్యాకు శిక్ష విధింపుగా..

డీజిల్‌ దిగుమతిపై నిషేధం.. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు సరికొత్త స్కెచ్‌!
Europe Bans Russian Diesel
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 06, 2023 | 9:04 AM

రష్యా నుంచి దిగుమతి అయ్యే డీజిల్, ఇతర చమురు ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు ఆదివారం (ఫిబ్రవరి 5) యూరప్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై వరుస దాడుల దృష్ట్యా రష్యాకు శిక్ష విధింపుగా క్రెమ్లిన్ శిలాజ ఇంధన ఆదాయాన్ని మరింత తగ్గించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. గ్రూప్ ఆఫ్ సెవెన్ అలీడ్ డెమోక్రసీలు అంగీకారం తెల్పిన తర్వాత యూరప్‌లో ధరల పరిమితితోపాటు నిషేధం అమలులోకి రానుంది. చైనా, భారత్‌ వంటి దేశాలకు రష్యా నుంచి డీజిల్‌ సరఫరాలో అడ్డుకులు తొలగించడం, ఆకస్మిక ధరల పెరుగుదల నివారించడం, మాస్కో బడ్జెట్‌కు, యుద్ధానికి నిధులు సమకూర్చే మార్గాలను మూసివేయడాన్ని యూరప్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

నిజానికి రష్యా ఆర్థిక వ్యవస్థకు డీజిల్‌ కీలక వనరు. కోవిడ్‌ తర్వాత డిమాండ్ పుంజుకోవడం, రిఫైనింగ్ కెపాసిటీపై పరిమితులు, ప్రపంచవ్యాప్తంగా ఇతర వస్తువుల ద్రవ్యోల్బణానికి దోహదం చేయడం వల్ల డీజిల్ ధరలు అమాంతంగా పెరిగాయి. ఐతే తాజాగా యూరప్‌ తీసుకొస్తున్న ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి తీసుకురానుంది. దీనిలో భాగంగా దాదాపు 27 యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా నుంచి ఇందన సరఫరాకు మొగ్గు చూపాయి. బదులుగా భారత్‌తోపాటు మిడిల్ ఈస్ట్ దేశాలకు రష్యా నుంచి డీజిల్‌ సరఫరా అవుతుంది. ఇది ఐరోపా మొత్తం డీజిల్ అవసరాల్లో కేవలం 10 శాతం మాత్రమే పంపిణీ చేస్తుంది. చైనాలో కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేస్తే అక్కడ ఇందన డిమాండ్‌ వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. డీజిల్, జెట్ ఫ్యూయెల్‌, గ్యాసోలిన్‌ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పరిమితి చేయడం, ఇన్సూరెన్స్‌, షిప్పింగ్ సేవలకు పరిమితికి మించి ధరలు ఉంటే డీజిల్‌ వినియోగించకుండా నిరోధించడం ద్వారా యూరప్‌ తన లక్ష్యాలను అమలు చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.