Satyagrah Express Train Accident: సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. రైలు నుంచి విడిపోయిన ఐదు బోగీలు..

వేలాది ప్రయాణికులతో వెళ్తున్న సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి హఠాత్తుగా ఐదు బోగీలు గురువారం (ఫిబ్రవరి 2) ఇంజిన్‌ నుంచి విడిపోయాయి. బీహార్‌లోని రక్సాల్ జిల్లా నుంచి..

Satyagrah Express Train Accident: సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. రైలు నుంచి విడిపోయిన ఐదు బోగీలు..
Satyagrah Express
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2023 | 7:42 PM

వేలాది ప్రయాణికులతో వెళ్తున్న సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి హఠాత్తుగా ఐదు బోగీలు గురువారం (ఫిబ్రవరి 2) ఇంజిన్‌ నుంచి విడిపోయాయి. బీహార్‌లోని రక్సాల్ జిల్లా నుంచి న్యూఢిల్లీకి సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ బయల్దేరిన నిముషాల వ్యవధిలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. రెండు బోగీలను ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి ఉపయోగించే కప్లింగ్ పనిచేయకపోవడంతో బోగీలు ఇంజిన్ నుంచి వేరుపడ్డాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో ముజఫర్‌పూర్-నార్కతియాగంజ్ రైల్వే సెక్షన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి బోగీలు వేరైన తర్వాత ఇంజిన్ చాలా కిలోమీటర్ల దూరం ముందుకెళ్లింది.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైలుకు బోగీలను మళ్లీ అమర్చారు. ఈ సంఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలియజేశారు. ఈ ఘటన ఎందుకు, ఎలా జరిగిందనే దానిపై తూర్పు మధ్య రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. కాగా గత ఏడాది డిసెంబర్‌లో బీహార్‌లోని టంకుప్ప స్టేషన్‌లో గూడ్స్ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పడంతో రెండు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. బ్రేక్‌లు జామ్‌ కావడంతో ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.