AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..? టికెట్‌ అడిగితే.. పిల్లోడిని వదిలేసి వెళ్లిపోతారా..

తల్లిదండ్రులకు పిల్లలే ఆస్తులు. వారి కోసం తమ సర్వస్వాన్ని అర్పించుకుంటారు. అలాంటిది ఓ జంట మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించి అబాసుపలయ్యారు. ఇంతకీ విషయమేమంటే..

ఇదేందయ్యా ఇది..? టికెట్‌ అడిగితే.. పిల్లోడిని వదిలేసి వెళ్లిపోతారా..
Couple Leaves Baby At Airport
Srilakshmi C
|

Updated on: Feb 02, 2023 | 6:24 PM

Share

తల్లిదండ్రులకు పిల్లలే ఆస్తులు. వారి కోసం తమ సర్వస్వాన్ని అర్పించుకుంటారు. అలాంటిది ఓ జంట మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించి అబాసుపలయ్యారు. ఇంతకీ విషయమేమంటే.. ఓ జంట ఇజ్రాయెల్‌ నుంచి బెల్జియంలోని బ్రస్సెల్స్‌కు వెళ్లవల్సి వచ్చింది. అందుకు తమ కొడుకుతో సహా ర్యాన్‌ఎయిర్ విమానం ఎక్కేందుకు మంగళవారం (ఫిబ్రవరి 1) ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఐతే ఈ జంట తమ కొడుకుకి టికెట్ కొనుగోలు చేయలేదు. చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పిల్లాడికి టికెట్‌ ఇవ్వమని అడిగారు. సదరు జంట పిల్లాడికి టికెట్‌ కొనలేదని తెలిపారు. కొంత డబ్బు చెల్లించి టికెట్‌ కొనమని అధికారులు సూచించారు. అందుకు నిరాకరించిన దంపతులు, తమ కొడుకును అక్కడే వదిలి విమానం ఎక్కేందుకు పరుగులు తీశారు.

దీంతో షాక్‌ తిన్న ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెంటనే అప్రమత్తమయ్యి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని దంపతులను బ్రస్సెల్‌ వెళ్లనివ్వకుండా అరెస్ట్‌ చేశారు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన మేము ఎప్పుడూ చూడలేదు. అందుకే మేము చూసినదాన్ని వెంటనే నమ్మలేకపోయాము. ఆ చిన్నారిని మా వద్దే ఉంచుకుని పోలీసులకు సమాచారం అందించాం. స్మగ్లింగ్‌ చేసి చిన్నారిని తీసుకెళ్తున్నారేమోనని అనుకున్నాం. ఐతే చిన్నారి ఆ దంపతుల స్వంత బిడ్డ అని తెలిశాక చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. పోలీసులు వారిద్దరినీ విచారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ర్యాన్‌ఎయిర్ విమానం నిబందనల ప్రకారం తల్లిదండ్రులు పిల్లలతో ప్రయాణాలు చేయవల్సి వస్తే ల్యాప్‌ సీటు కోసం 25 యూరోలు చెల్లించి టికెట్‌ కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.