UPSC Civil Services 2023: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి 1105 కొలువులకు పోటీ..

న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర సర్వీసుల్లో.. 1105 ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పలు సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

UPSC Civil Services 2023: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి 1105 కొలువులకు పోటీ..
UPSC CSE 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 01, 2023 | 8:28 PM

న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర సర్వీసుల్లో.. 1105 ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి పలు సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులను సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2023 ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 21, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 28న నిర్వహిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం..

తొలి దశ.. ప్రిలిమినరీ రాత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఐతే రెండో పేపర్ జనరల్ స్టడీస్ మాత్రం క్వాలిఫైయింగ్ పేపర్‌. దీనిలో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ రెండు పేపర్లకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్షలు 8 పేపర్లకు మొత్తం 1750 మార్కులకు నిర్వహిస్తారు. వీటిల్లో క్వాలిఫైయింగ్‌ పేపర్లు 2 ఉంటాయి. మిగిలిన 5 పేపర్లలో పొందిన మార్కులను ఫైనల్‌గా కౌంట్‌ చేస్తారు. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2,025 మార్కులకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సర్వీసులు ఇవే..

  • ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
  • ఇండియన్ ఫారిన్ సర్వీస్
  • ఇండియన్ పోలీస్ సర్వీస్
  • ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ పి అండ్‌ టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌) గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్‌కం ట్యాక్స్‌) గ్రూప్ ‘ఎ’
  • ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’ (గ్రేడ్-3)
  • ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్, గ్రూప్ ‘ఎ’
  • ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ ‘బి’ (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
  • ఢిల్లీ, అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్‌ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్ హవేలీ సివిల్ సర్వీస్, గ్రూప్ ‘బి’
  • ఢిల్లీ, అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్‌ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్, గ్రూప్ ‘బి’
  • పాండిచ్చేరి సివిల్ సర్వీస్, గ్రూప్ ‘బి’
  • పాండిచ్చేరి పోలీస్ సర్వీస్, గ్రూప్ ‘బి’

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్