అమానుషం..! ఆపరేషన్ పేరుతో బాలిక అవయవాలు మాయం చేసిన వైద్యులు.. కడుపులో ప్లాస్టిక్ కవర్లు కుక్కి..
ప్రాణాలు పోయవల్సిన డాక్టర్లు రోజురోజుకీ కిరాతకులుగా మారిపోతున్నారు. దేశ రాజధానిలో ఓ ఆపుపత్రిలో ఆపరేషన్ పేరుతో బాలిక శరీరంలోని అవయవాలను దొంగిలించారు. అనంతరం ప్లాస్టిక్ కవర్లను పెట్టేసి కుట్లు వేశారు. కాసేపటికే బాలిక మృతి..
ప్రాణాలు పోయవల్సిన డాక్టర్లు రోజురోజుకీ కిరాతకులుగా మారిపోతున్నారు. దేశ రాజధానిలో ఓ ఆపుపత్రిలో ఆపరేషన్ పేరుతో బాలిక శరీరంలోని అవయవాలను వైద్యులు దొంగిలించారు. అనంతరం ప్లాస్టిక్ కవర్లను పెట్టేసి కుట్లు వేశారు. కాసేపటికే బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ న్యాయం చేయండంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అపెండిసైటిస్ నొప్పితో బాధపడుతున్న బాలిక (15)ను తల్లిదండ్రులు జనవరి 21న ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో జనవరి 24న బాలికకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం జనవరి 26న బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బాలిక శరీరంపై పలుచోట్ల ఆపరేషన్ చేసిన గాయాలు, కుట్లు కనిపించాయి. వాటిల్లో నుంచి పాలిథిన్ బ్యాగులు కనిపించడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ పేరుతో తమ కూతురు అవయవాలను దొంగిలించారని ఆసుపత్రి యాజమాన్యంపై మృతురాలి తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మంగళవారం (జనవరి 31) నాడు పోస్ట్ మార్టం నిమిత్తం జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి రిపోర్టు వచ్చాక బాలిక మరణానికి కారణం ఏంటనేది తెలుస్తుందని, దాని ఆధారంగా తదపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ సింగ్ కల్సీ మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.