Palm Oil: మీరూ పామాయిల్‌ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే జీవితంలో ముట్టుకోరు..

చౌకగా లభించే వంట నూనెల్లో పామ్‌ ఆయిల్‌ ముందు వరుసలో ఉంటుంది. పామ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. పెద్ద పెద్ద కంపెనీల్లో..

Palm Oil: మీరూ పామాయిల్‌ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే జీవితంలో ముట్టుకోరు..
Palm Oil
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 01, 2023 | 3:23 PM

చౌకగా లభించే వంట నూనెల్లో పామ్‌ ఆయిల్‌ ముందు వరుసలో ఉంటుంది. పామ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. పెద్ద పెద్ద కంపెనీల్లో బిస్కెట్లు, కుకీస్‌, చాక్లెట్స్ తయారీలో కూడా కానీ పామ్ ఆయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్‌ను వినియోగిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో, రెస్టారెంట్లలో కూడా పామాయిల్‌నే వినియోగిస్తుంటారు. వీటిని తినడంతోపాటు నిత్యం ఇళ్లలో వంటనూనెగా కూడా పామ్‌ ఆయిల్‌ను వినియోగిస్తుంటాం. ఐతే ఈ నూనెను వాడటం వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పామ్‌ ఆయిల్‌తో చేసిన వంటకాలు తింటే పిల్లల బ్రెయిన్ డ్యామేజ్‌ అవుతుందని చెబుతున్నారు. పామాయిల్ వల్ల గుండె జబ్బులు, చిన్న వయసులోనే డయాబెటిస్ బారీన పడటం ఖాయం. మద్యపానం, ధూమపానం ఈ రెండింటి వల్ల వచ్చే నష్టాం కంటే పామ్ ఆయిల్ వాడటం వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ.

ప్రపంచంలో పామ్ ఆయిల్‌ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం మనదే. ఈ పామ్ ఆయిల్ వెనక పెద్ద మాఫియానే ఉన్నట్లు పరిశోధనల్లో బయటపడింది. విదేశాల్లోని కొన్ని కంపెనీలు తమ విదేశాల్లో విక్రయించే ఉత్పత్తులకు వేరే వంట నూనెను వాడుతూ, ఇండియాలో అమ్మే ఉత్పత్తులకు మాత్రం పామ్ ఆయిల్‌ని వాడుతున్నారట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల జంక్ ఫుడ్‌కి ప్రజలు అలవాటు పడేలా చేసి.. పండ్లు, కూరగాయలను తిననివ్వకుండా దూరం చేస్తోంది. గుండెను కాపాడే పండ్లను తినకుండా.. పామ్ ఆయిల్‌తో తయారు చేసిన జంక్‌ఫుడ్‌ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ప్రాణాంతక వ్యాధులు దాపురిస్తాయి. బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు, పండ్లు తినడం, అలాగే పామ్ ఆయిల్, పాల్మొలినిక్ ఆయిల్, పాల్మిటిక్ యాసిడ్ వంటివి కలిసిన నూనెలు, వీటితో తయారు చేసిన చిరుతిళ్లు కొనవద్దంటూ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.