Kantara: ‘అందుకే కాంతార ఆస్కార్‌కు నామినేట్‌ కాలేదు’: నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

హోంబలే ఫిలిం నిర్మాణంలో, కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా కాంతార. ఐతే ఈ మువీ విడుదలైన కేవలం రోజుల వ్యవధిలోనే..

Kantara: 'అందుకే కాంతార ఆస్కార్‌కు నామినేట్‌ కాలేదు': నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
Kantara
Follow us
Srilakshmi C

| Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2023 | 3:07 PM

హోంబలే ఫిలిం నిర్మాణంలో, కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా కాంతార. ఐతే ఈ మువీ విడుదలైన కేవలం రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా పాన్‌ ఇండియా లెవల్‌కి చేరుకుంది. అన్ని భాషల్లో ఈ సినిమా పెద్ద హిట్‌ సాధించింది. ఆస్కార్‌కు షాట్‌లిస్ట్‌ అయిన కాంతారా నామినేషన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. కాంతార ఆస్కార్‌కు నామినేట్‌ కాకపోవడంపై తాజాగా ఈ మూవీ నిర్మాత, హోంబలే ఫిలిం అధినేత విజయ్ కిరగందూర్ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘కరోనా మొదలైనప్పటి నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. ఆడియన్స్‌ కొత్త రకం కంటెంట్‌నే కోరుకుంటున్నారు. కాంతార ద్వారా తుళు కల్చర్‌ని పరిచయం చేశాం. ఇకపై కూడా అలాంటి కథలపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం. కాంతార గతేడాది సప్టెంబర్‌ రిలీజయింది. అందువల్లనే అంతర్జాతీయ స్థాయిలో ‘కాంతార’ను ప్రచారం చేయలేకపోయాం. ప్రచారానికి తగిన సమయంలేకపోవడం వల్లే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్‌కాలేకపోయింది. ఆస్కార్‌ నామినేషన్స్ సమయం నాటికి ప్రచారం చేయలేకపోయాం. అందుకే ఆస్కార్‌ లేదా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకోలేక పోయిందనుకుంటున్నా.. దీనిని ‘కాంతార 2’ ద్వారా భర్తీ చేసేందుకు తెరకెక్కిస్తున్నాం. 2024లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ తెలిపారు. కాగా ‘కేజీయఫ్‌’తో మంచి గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌ దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై, పెద్ద విజయాన్ని అందుకున్న ‘కాంతార’కు సీక్వెల్‌గా కాంతారా-2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.