TSPDCL: తెలంగాణ విద్యుత్తు శాఖలో 1601 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌.. మంత్రి కీలక ఆదేశాలు

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో 1601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు..

TSPDCL: తెలంగాణ విద్యుత్తు శాఖలో 1601 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌.. మంత్రి కీలక ఆదేశాలు
TSPDCL
Follow us

|

Updated on: Feb 01, 2023 | 7:53 PM

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో 1601 ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటిల్లో 1553 జూనియర్‌ లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు మంగళవారం (జ‌న‌వ‌రి 31) మింట్‌ కాంపౌండ్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస (టీఈఈజాక్‌) కన్వీనర్‌ ఎన్‌ శివాజీ నేతృత్వంలో పలువురు జ‌న‌వ‌రి 31న మంత్రిని కలిసి పీఆర్సీపై విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

ఈపీఎఫ్‌ నుంచి జీపీఎఫ్‌కు మార్పు, ట్రాన్స్‌కో, జెన్‌కోలలో 166 మంది ఇంజినీర్ల రివర్షన్‌ అంశాలనూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రివర్షన్‌ అయిన వారిని సర్దుబాటు చేయడానికి ఉన్న అవకాశాలను మంత్రికి వివరంగా తెలియజేశారు. విద్యుత్తు ఇంజినీర్లలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వమని, పూర్తి వివరాలు పరిశీలించి చర్యలు చేపడతామని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.