TS High Court Recruitment 2023: తెలంగాణ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ స్టేట్ జుడీషియల్ సర్వీస్ కింద జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 10 జడ్జి పోప్టులకు నియామకాలు..
తెలంగాణ స్టేట్ జుడీషియల్ సర్వీస్ కింద జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 10 జడ్జి పోప్టులకు నియామకాలు చేపట్టనున్నారు. వీటిల్లో ఎనిమిదింటిని ప్రత్యక్ష నియామకం ద్వారా, మరో రెండు బదిలీ ద్వారా భర్తీ చేయనున్నట్లు హైకోర్టు తన ప్రకటనలో తెల్పింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఏప్రిల్ 23న జరుగుతుందని ప్రకటనలో పేర్కొంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.