AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: తెలంగాణకే తలమానికం.. కేజీ టూ పీజీ క్యాంపస్ ప్రారంభం.. అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రంలోనే ఫస్ట్..

తెలంగాణలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు - మన బడి కార్యక్రంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టూ పీజీ క్యాంపస్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఆయనతో...

Minister KTR: తెలంగాణకే తలమానికం.. కేజీ టూ పీజీ క్యాంపస్ ప్రారంభం.. అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రంలోనే ఫస్ట్..
Minister Ktr
Ganesh Mudavath
|

Updated on: Feb 01, 2023 | 3:34 PM

Share

తెలంగాణలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టూ పీజీ క్యాంపస్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. క్యాంపస్ తో తిరిగారు. విద్యార్థులతో ముచ్చటించారు. అన్ని రకాల అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని పరిశీలించారు. ఈ క్యాంపస్ తో పాటు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 పాఠశాలలనూ మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌ గంభీరావుపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రులు చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను.. కేజీ టూ పీజీ వరకు ఒకే చోట అందిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

క్యాంపస్ లో మొత్తం 70 తరగతి గదులు ఉన్నాయి. 3,500 మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో చదువుకునేలా ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్‌ హబ్‌లు నిర్మించారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్‌వాడీ కేంద్రం, ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానం, ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కళాశాలకు అవసరం అయ్యేలా భవనాలు సిద్ధం చేశారు. డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా డైనింగ్‌ హాల్‌ నిర్మించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని తమ ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు సూచించారు.

కాగా.. ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నో మాయమాటలు చెప్పి, 2014లో అధికారంలోకి వచ్చి.. ఏవీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అదనపు సెస్సులతో పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఎందుకు దేవుడవుతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన అరిష్టమంటూ కొన్ని రోజుల కిందట ఈటల రాజేందర్‌ బాధ కలిగించేలా మాట్లాడారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..