Budget 2023: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే.. పూర్తి వివరాలు..

2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది.

Budget 2023: కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే.. పూర్తి వివరాలు..
Budget 2023 For Ap And Telangana
Follow us

|

Updated on: Feb 01, 2023 | 3:34 PM

2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1గంటా 26నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. కాగా.. ఈ సారి అనేక రంగాలతోపాటు వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే, కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు భారీగా కేటాయింపులు దొరికాయి. వేలాది కోట్లను కేంద్రం ఇరు తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. అవేంటో తెలుసుకుందాం..

  1. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి 47 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి.
  2. పెట్రోలియం యూనివర్సిటీకి 168 కోట్లు, రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు 37 కోట్లు కేటాయించారు.
  3. సింగరేణికి 1,650 కోట్ల రూపాయలు వచ్చాయి.
  4. ఐఐటి హైదరాబాద్‌కు EAP కింద 300 కోట్లు కేటాయించారు.
  5. ఇవి కూడా చదవండి
  6. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు 683 కోట్లు కేటాయించారు.
  7. మంగళగిరి, బిబినగర్‌ ఎయిమ్స్‌తోసహా.. దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు 6వేల 835 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి.
  8. సాలార్జంగ్‌ మ్యూజియంతోపాటు.. దేశంలోని అన్ని మ్యూజియాల 357 కోట్లు కేటాయించారు.
  9. మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు 1473 కోట్లు, ఇంకాయిస్‌కి 27 కోట్లు దక్కాయి.
  10. ఇక కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద 41వేల338 కోట్లు,
  11. తెలంగాణ వాటా 21వేల470కోట్లుగా కేంద్రం ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..