Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేతలను ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు.. సజ్జల షాకింగ్ కామెంట్స్..

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఆయన టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, అందుకే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు....

Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేతలను ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు.. సజ్జల షాకింగ్ కామెంట్స్..
Sajjala
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 01, 2023 | 4:15 PM

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఆయన టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, అందుకే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కోటంరెడ్డి స్వయంగా తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత.. చర్యలు ఏం తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్న సజ్జల.. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని వెల్లడించారు. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని సజ్జల వివరించారు. వైసీపీ నేతలను ఎలా లాక్కోవాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసునని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీధర్ రెడ్డి టీడీపీ డైరెక్షన్ లో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బాలినేని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా జరగలేదన్న ఆయన.. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నిరూపించాలని సవాల్‌ విసిరారు. రేపో ఎల్లుండో నెల్లూరు రూరల్ కి కొత్త ఇంచార్జి నియామకం ఉంటుందని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు కొదవ లేదన్న బాలినేని.. ఒకరు పోతే పది మంది తయారవుతారని స్పష్టం చేశారు.

ఓ వైపు.. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు దక్కించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్.. నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.. మరోవైపు జిల్లాల్లో వైసీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో సీఎం జగన్ రంగంలోకి దిగారు. కీలక నేతలతో మీటింగ్ నిర్వహించబోతున్నారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజక వర్గ ఇంచార్జ్‌గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..