Giant Baby Birth: 8 కేజీ బరువు, రెండు అడుగుల పొడవున్న శిశువుకు జన్మనిచ్చిన మహిళ
దాదాపు 8 కేజీల బరువు, రెండు అడుగుల పొడవున్న శిశువుకు బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ జన్మనిచ్చింది. యాంగర్సన్ శాంటోస్ అనే మహిళకు సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు..
దాదాపు 8 కేజీల బరువు, రెండు అడుగుల పొడవున్న శిశువుకు బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ జన్మనిచ్చింది. యాంగర్సన్ శాంటోస్ అనే మహిళకు సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు. అధిక బరువుతో జన్మించిన ఈశిశువు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఇటలీ (1955)లో 10.2 కేజీల బరువుతో శిశువు జన్మించాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత అధిక బరువుతో జన్మించిన బిడ్డగా రికార్డు ఉంది. ఇంతవరకు ఈ రికార్డును బ్రేక్ చేసినవారు లేరు. తాజాగా బ్రెజిల్ లో జన్మించిన శిశువు ఆ రికార్డుకు కాస్త చేరువగా 7.328 కేజీల బరువుతో పుట్టడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువుల్లో మగ శిశువు 3.3 కేజీలు, ఆడ శిశువు 3.2 కేజీల బరువు అంతకంటే కొన్ని గ్రాములు తక్కువ బరువుతో జన్మించడం జరుగుతుంది. ఐతే అరుదుగా మాత్రమే జెయింట్ బేబీల జననాలు నమోదవుతుంటాయి. ఇలా అధిక బరువుతో పుట్టిన బిడ్డలను మాక్రోసోమియా అని అంటారు. 4 కేజీలు అంత కంటే ఎక్కువ బరువు ఉన్న శిశువులు జన్మిస్తే వైద్య పరిభాషలో మాక్రోసోమియా అని అంటారు.
ప్రపంచం మొత్తం జనాభాలో ఈ విధమైన జననాలు 12 శాతం వరకు నమోదవుతుంటాయి. మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహం తలెత్తితే 15 నుంచి 45 శాతం శిశువులు అధిక బరువుతో జన్మిస్తారు. 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే మాక్రోసోమియా వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువ. అలాగే తండ్రి వయసు 35 కంటే ఎక్కువ ఉంటే మాక్రోసోమియా ప్రమాదం 10 శాతం ఉంటుంది. అలాగే శిశువు జన్మించని తర్వాత కేవలం ఏడేళ్ల వయసుకే విపరీతంగా బరువు పెరుగుతారు. ఇటువంటి జననాల్లో శిశువు బరువు కారణంగా తల్లికి ప్రాణాపాయ ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు వివరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.