Radioactive Capsule: హమ్మయ్య.. ఆ చిన్నది దొరికిందోచ్.. సంబరపడిపోతున్న ఆస్ట్రేలియా అధికారులు..
ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన చిన్నపాటి క్యాప్సూల్.. అధికారులను, ప్రజలను ముచ్చెమటలు పట్టిచ్చిన విషయం తెలిసిందే. ఈ చిన్న పాటి క్యాప్సుల్ పోవడంతో దేశంలో హైఅలెర్ట్ ప్రకటించారు.
ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన చిన్నపాటి క్యాప్సూల్.. అధికారులను, ప్రజలను ముచ్చెమటలు పట్టిచ్చిన విషయం తెలిసిందే. ఈ చిన్న పాటి క్యాప్సుల్ పోవడంతో దేశంలో హైఅలెర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా అధికార యంత్రాంగం సైతం రాత్రి పగలు అనే తేడా లేకుండా దానికోసం వెతికింది. అయితే, ఆరు రోజుల సుధీర్ఘ వేట తర్వాత ఎట్టకేలకు క్యాప్సుల్ దొరకడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ క్యాప్సుల్ కథ ఎంటీ..? దాని కోసం ఎందుకు అంతలా వెతికారు.. దాని వల్ల సమస్యలు ఎలా వస్తాయి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 6 మిల్లి మీటర్ల వ్యాసం, 8 మిల్లి మీటర్ల పొడవు గల అతి చిన్న క్యాప్సూల్‌లో రేడియోధార్మిక పదార్థం సీజియం- 137 ఉంది. అది అత్యంత ప్రమాదరకం.. కావున ఆస్ట్రేలియా అధికార యంత్రాంగం హడలెత్తిపోయింది. చివరకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూమాన్ పట్టణానికి దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతంలో రహదారి పక్కన దీనిని కనుగొన్నట్లు అత్యవసర సేవల కమిషనర్ డారెన్ క్లెమ్ వెల్లడించారు.
రెడియాక్టివ్ క్యాప్సూల్‌ను ఏడు రోజుల క్రితం ట్రక్కులో పశ్చిమ ఆస్ట్రేలియా న్యూమన్ ఉత్తర ప్రాంతంలోని ఓ సైట్ నుంచి పెర్త్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఎక్కడో పడిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గాలింపు చర్యలు చేపట్టారు. కిలో మీటర్ల మేర దానికోసం వేట కొనసాగించారు.
ఈ సీజియం- 137ను మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగిస్తారు. అంటే దాని తీవ్రత ఏవిధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాప్సుల్ రేడియేషన్‌ను విడుదల చేస్తోంది. దీంతో దాన్ని తాకినా తీవ్ర సమస్యలు వస్తాయి. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదని అగ్నిమాపక, అత్యవసర సేవల విభాగం ప్రజలను హెచ్చరించింది.
క్యాప్సూల్ ఫొటో విడుదల చేసి.. ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో ఆరు రోజుల సుధీర్ఘ వేట అనంతరం క్యాప్సుల్ దొరకడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దానిని స్వాధీనం చేసుకున్న అనంతరం సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..