వాటర్‌ ట్యాంక్‌లో పొలిటీషియన్‌ కొడుకు మృతదేహం.. 9 రోజుల్నుంచి కుళ్లిన శవం నీళ్లు తాగుతోన్న గ్రామస్తులు

గత కొన్ని రోజులుగా కనపడకుండా పోయిన రాజకీయ నాయకుడి కొడుకు ఆ ఊరి తాగునీటి వాటర్ ట్యాంక్‌లో శవమై తేలాడు. ఐతే ఈ విషయం తెలియక ఊరు ప్రజలంతా గడచిన తొమ్మిది రోజుల నుంచి కళ్లిన శవం ఉన్న నీటినే తాగారు. తీరా విషయం తెలిశాక..

వాటర్‌ ట్యాంక్‌లో పొలిటీషియన్‌ కొడుకు మృతదేహం.. 9 రోజుల్నుంచి కుళ్లిన శవం నీళ్లు తాగుతోన్న గ్రామస్తులు
Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2023 | 3:57 PM

కనపడకుండా పోయిన రాజకీయ నాయకుడి కొడుకు ఆ ఊరి తాగునీటి వాటర్ ట్యాంక్‌లో శవమై తేలాడు. ఐతే ఈ విషయం తెలియక ఊరు ప్రజలంతా గడచిన తొమ్మిది రోజుల నుంచి కళ్లిన శవం ఉన్న నీటినే తాగారు. తీరా విషయం తెలిశాక ఇన్ఫెక్షన్ భయంతో ఆసుపత్రులకు పరుగు తీశారు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడులోని కడలూరు జిల్లా విరుధాచలం సమీపంలోని రాజేంద్రపట్నం గ్రామంలో శివశంకర్ అనే రాజకీయ నాయకుడు . శివవంకర్ కుమారుడు శరవణ కుమార్ (34) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చెయ్యకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి శివశంకర్ ఓడిపోయాడు. ఆ క్రమంలో శివశంకర్ కుమారుడు శరవణ కుమార్ గత 9 రోజుల క్రితం ఓపని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. కనబడకుండాపోయిన కుమారుడి కోసం కుంటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికినా అతని ఆచూకీ లభించలేదు. శరవణ రేమార్‌ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో శివశంకర్‌ తన కొడుకును ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో గత రెండు, మూడు రోజులుగా తాగునీరు దుర్వాసన రావడంతో గ్రామస్తులు ఊరి పెద్దలకు ఫిర్యాదు చేశారు. వాటర్ ట్యాంక్ తెరిచి చూడగా కనిపించకుండా పోయిన శరవణ కుమార్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో అంతా షాకయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వాటర్ ట్యాంక్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దాదాపు 750 కుటుంబాలున్న గ్రామ ప్రజలు త తొమ్మిది రోజుల్నుంచి కుళ్లిన మృతదేహం ఉన్నతాగు నీళ్లను తాగుతున్నారు. ఈ విషయం బయటికి పొక్కడంతో గ్రామ ప్రజలు ప్రాణ భయంతో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగు తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.