AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక మలుపు.. చార్జిషీట్‌లో ఆ ముఖ్యమంత్రి పేరు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. చార్జిషీట్‌లో రోజుకో కొత్త పేర్లు చేర్చుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండో చార్జీషీట్‌ను ఫైల్‌ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది...

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలక మలుపు.. చార్జిషీట్‌లో ఆ ముఖ్యమంత్రి పేరు.
Delhi Liquor Scam
Narender Vaitla
|

Updated on: Feb 02, 2023 | 4:31 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. చార్జిషీట్‌లో రోజుకో కొత్త పేర్లు చేర్చుతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండో చార్జీషీట్‌ను ఫైల్‌ చేసిన అధికారులు కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. చార్జిషీట్‌లో ఈడీ అధికారులు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా చార్జిషీట్‌లో వైసీపీ ఎంపీ మాగుంట పేరును కూడా చేర్చారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడంతో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఒక్కసారిగా ఊహించని మలుపు తిప్పింది.

428 పేజీలతో కూడిన రెండో చార్జీషీట్‌ను ఈడీ విడుదల చేసింది. ఎక్సైజ్‌ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను మొత్తం నడిపించింది విజయ్‌ నాయర్‌ అంటూ చార్జిషీట్‌లో ప్రస్తావించారు. అంతేకాకుండా విజయ్‌ నాయర్‌.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్యాంప్‌ ఆఫీస్‌లోనే లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన తతంగం అంతా నడిచినట్లు ఈడీ పేర్కొంది.

ఈడీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల సంస్థ: కేజ్రీవాల్‌

ఇదిలా ఉంటే రెండో ఛార్జిషీట్‌లో తన పేరును ప్రస్తావించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ అనేది ఎమ్మెల్యేల కొనుగోళ్ల సంస్థ అని సీఎం అభివర్ణించారు. అధికారంలో ఉన్న పార్టీ కోసం ఈడీ పనిచేస్తుందని, అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పనిచేయడం లేదని వమర్శించారు. ఇక ప్రభుత్వాలను కూల్చడానికే ఈడీ పనిచేస్తుందని కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!