BSF Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పదో తరగతి అర్హతతో బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 1410 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. 1410 కానిస్టేబుల్ (ట్రేడ్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి..

BSF Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! పదో తరగతి అర్హతతో బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 1410 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..
BSF Constable (Tradesman) Recruitment 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2023 | 8:08 PM

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. 1410 కానిస్టేబుల్ (ట్రేడ్‌మ్యాన్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ప్లంబర్‌/పెయింటర్‌/ఎలక్ట్రీషియన్‌/పంప్‌ ఆపరేటర్‌/డ్రాఫ్ట్‌మ్యాన్‌/టిన్‌స్మిత్‌/టైలర్‌/కాబ్లర్‌/బార్బర్‌/మాలి/స్వీపర్‌/వాషర్‌మ్యాన్/కుక్‌/వాటర్‌ క్యారియర్‌/వెయిటర్/బట్చర్ తదితర స్పెషలైజేషన్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ కూడా ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలు కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ఫిజికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.