Paracetamol: జ్వరం, జలుబు వంటి సమస్యలకు ప్రతిసారీ పారాసిటమాల్‌ వేసుకుంటున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..

కాస్త నలతగా ఉంటే చాలు వెంటనే పారాసెటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. తలనొప్పి, దగ్గు, జ్వరం, జలుబు.. ఇలా ప్రతి సమస్యకు సర్వరోగ నివారిణిలా..

Paracetamol: జ్వరం, జలుబు వంటి సమస్యలకు ప్రతిసారీ పారాసిటమాల్‌ వేసుకుంటున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..
Paracetamol Side Effects
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2023 | 9:45 PM

కాస్త నలతగా ఉంటే చాలు వెంటనే పారాసెటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. తలనొప్పి, దగ్గు, జ్వరం, జలుబు.. ఇలా ప్రతి సమస్యకు సర్వరోగ నివారిణిలా పారాసెటమాల్ ను తీసుకోవడం అంతమంచిది కాదంటున్నారు వైద్యులు. ఒక్కోసారి అధికపని ఒత్తిడి కారణంగా జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ బడలిక పోయేందుకు కూడా చాలా మంది పారాసెటమాల్‌ మాత్రలు వేసుకుంటుంటారు. వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే సీజనల్‌ రోగాలకు కూడా ఇదే మందుగా భావిస్తుంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వైద్యుల సూచన లేకుండా దీన్ని వాడితే ప్రాణాపాయం ఉందని ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నారు.

పారాసెటమాల్ అధికంగా వినియోగించడం వల్ల కాలేయం వైఫల్యానికి దారి తీస్తుందని న్యూ ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మనోజ్ శర్మ హెచ్చరిస్తున్నారు. జ్వరం రెండు రోజులకు మించి వస్తుంటే వైద్యుడిని సంప్రదించకుండా ఈ మందులు అస్సలు తీసుకోకూడదని లూథియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ ఎరిక్ విలియమ్స్ సూచిస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత వైద్యాన్ని పాటించకూడదు. ఎందుకంటే దీని ప్రభావం సుదీర్ఘకాలంపాటు శరీరానికి హాని తలపెడుతుంది. కేవలం జ్వరమే మాత్రమే కాదు ఏ కొంచెం తలనొప్పి అనిపించిన పారాసెటమల్‌ మందులు వేసుకునే అలవాటును వెంటనే ఆపివేయాలని, ఈ అలవాట్లు కాలక్రమేణా శరీరంపై చెడు ప్రభావం చూపుతాయని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.