Mini couple: ‘మినీ కపుల్‌’ కల్యాణ వైభోగమే.! ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమాయణం..వైరల్‌ అవుతున్న మినీ కపుల్‌ వీడియో..

Mini couple: ‘మినీ కపుల్‌’ కల్యాణ వైభోగమే.! ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమాయణం..వైరల్‌ అవుతున్న మినీ కపుల్‌ వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 06, 2023 | 9:07 AM

నెట్టింట పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఎందుకంటే పెళ్లంటేనే మన ఇండియాలో ఎంతో ప్రాధాన్యమైన వేడుక.

నెట్టింట పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఎందుకంటే పెళ్లంటేనే మన ఇండియాలో ఎంతో ప్రాధాన్యమైన వేడుక. రాష్ట్రం, ప్రాంతంతో పనిలేకుండా పెళ్లిళ్లకు సంబంధించిన ఏ అంశమైనా ఎంతో ఆసక్తి కనబరుస్తారు భారతీయులు. ఈ క్రమంలో నెట్టింట ఓ పెళ్లి వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈడు, జోడు అదిరింది.. జంట అంటే అలా ఉండాలి అంటూ ఆశీస్సులు కురిపిస్తున్నారు.రాజస్థాన్‌కు చెందిన ఈ వధూవరులిద్దరూ మరుగుజ్జులు కావడం ఇక్కడి విశేషం. సోషల్‌మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారు.. ఆ పరిచయమం ప్రేమగా మారి, పెద్దల ఆశీర్వాదంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. జోధ్‌పుర్‌కు చెందిన సాక్షి అనే యువతికి రాజ్‌సమంద్‌కు చెందిన రిషబ్‌తో సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారడంతో కుటుంబసభ్యులు కూడా అంగీకరించి ఏడాది క్రితమే నిశ్చితార్థం జరిపించారు. రెండు రోజుల కిందట.. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సాక్షి, రిషబ్‌ జంట ఇన్‌స్టాగ్రాంలో ‘మినీ కపుల్‌’ అనే ఐడీని క్రియేట్‌ చేసి పెళ్లి ఫొటోలు, వీడియో పోస్ట్‌ చేశారు. వీటిని చూసినవారంతా కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ జంట చురుగ్గా ఉంటూ తమ జీవితాల్లో జరిగే విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకొంటున్నారు. రిషబ్‌కు ఇన్‌స్టాగ్రాంలో 2,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రిషబ్‌ పోటీపరీక్షలకు సిద్ధమవుతుండగా.. ఎంబీఏ చదివిన సాక్షి ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 06, 2023 09:07 AM