Warangal Crime News: ‘నా చావుకు వాడే కారణం’.. సెల్ఫీ వీడియో తీసుకొని బీజేపీ నేత ఆత్మహత్య..
ఎన్నికల సమయంలో చేసిన అప్పు తీర్చలేక, అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక బీజేపీ నేత సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎన్నికల సమయంలో చేసిన అప్పు తీర్చలేక, అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక బీజేపీ నేత సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎనుమాముల బాలాజీనగర్‌కు చెందిన గంధం కుమారస్వామి (45) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ (వరంగల్) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఓట్ల సమయంలోఎనుమాముల మాజీ సర్పంచి సాంబేశ్వర్ నుంచి కుమార స్వామీ రూ. 25 లక్షలు తీసుకున్నాడు. ఎన్నికల్లో ఓటమిపాలై ఓ వైపు బాధపడుతుంటే.. మరోవైపు అప్పు ఇచ్చిన మాజీ సర్పంచి డబ్బుల కోసం వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. అప్పు ఇచ్చిన మాజీ సర్పంచి ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన భార్య, పిల్లలను వేధించవద్దంటూ సూసైడ్ లెటర్ రాశాడు. అనంతరం సెల్ఫీ వీడియోను మిత్రులకు పంపించి ఆదివారం (ఫిబ్రవరి 5) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తన భర్త మృతికి కారకులైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుమారస్వామి భార్య లక్ష్మి ఎనుమాముల సీఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.