China Spy Balloon: సంచలన విషయాలను వెల్లడించిన అమెరికా.. భారత్‌లో చైనా నిఘా బెలూన్ కలకలం..

అమెరికా గగనతంలో చైనాకు సంబంధించిన స్పై బెలూన్ ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. తమ గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసింది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

China Spy Balloon: సంచలన విషయాలను వెల్లడించిన అమెరికా.. భారత్‌లో చైనా నిఘా బెలూన్ కలకలం..
Chinese Spy Balloon
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 08, 2023 | 2:02 PM

అమెరికా గగనతంలో చైనాకు సంబంధించిన స్పై బెలూన్ ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. తమ గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసింది. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ రక్షణస్థావరాలపై చైనా నిఘాపెడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన అమెరికా.. తమ జోలికొస్తే.. ఎవర్నీ వదిలిపెట్టమంటూ డ్రాగన్ కంట్రీని హెచ్చరించింది. ఈ క్రమంలో స్పై బెలూన్ ఘటన అనంతరం అమెరికా సంచలన విషయాలను బయటపెట్టింది. భారత్‌, జపాన్‌తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా కొన్నేళ్లుగా స్పై బెలూన్‌లతో నిఘా ఉంచిందని అమెరికా నివేదించింది. ఐదు ఖండాల్లోని పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు సంచరిస్తున్న విషయాన్ని ఓ సంస్థ పేర్కొన్నట్లు యూఎస్ మీడియా పలు సంచలన విషయాలను నివేదించాయి. అయితే, భారత రక్షణ వ్యవస్థపై చైనా గూఢచర్యం ఎంత వరకు నిజమన్నది ఇంకా స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రంలోని దక్షిణ కరోలినా తీరంలో చైనా నిఘా బెలూన్‌ను ఫిబ్రవరి 4న కూల్చేసిన అమెరికా.. బెలూన్ విషయంతోపాటు పలు రహస్యాలను భారత్ సహా తమ మిత్రదేశాలకు వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారంపై ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. వాషింగ్టన్ లో ఉన్న 40 దేశాల ఎంబసీ అధికారులతో ఈ సమాచారం పంచుకున్నట్లు సమాచారం.

వాషింగ్టన్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. US డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండి షెర్మాన్ సోమవారం చైనా గూఢచర్యం విషయంపై 40 రాయబార కార్యాలయాల ప్రతినిధులకు వివరించారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని దక్షిణ కరోలినా తీరంలో గత శనివారం యుద్ధ విమానాలతో చైనా నిఘా బెలూన్‌ను కూల్చేసిన విషయంతోపాటు పలు రహస్యాలను భారత్ సహా తమ మిత్రదేశాలకు పంచుకున్నారు. యూఎస్ స్పై బెలూన్ అనేక దేశాలలో సైనిక ఆస్తులపై గూఢచర్యం చేయడానికి చైనా చేసిన కుట్రలో ఇది భాగమని అమిరికా పేర్కొంది. వ్యూహాత్మక దేశాల రక్షణ వ్యవస్థ, సైనిక శక్తి లాంటి వాటి గురించి వివరాలు సేకరించేందుకు నిఘా బెలూన్ తో చైనా అడుగులు వేస్తుందని పేర్కొంది. చైనాలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి ఇది పాక్షికంగా పనిచేస్తుందని పేర్కొంది.

నివేదిక ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) వైమానిక దళం పాక్షికంగా నిర్వహించే ఈ నిఘా బెలూన్లు లేదా ఎయిర్‌షిప్‌లు ఐదు ఖండాలలో గుర్తించినట్లు అమెరికా పేర్కొంది. బెలూన్లు PRC (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) నౌకాదళంలో భాగంగా ఉన్నాయి. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించడానికి చైనా వీటిని ఉపయోగిస్తోంది.

ఇవి కూడా చదవండి

కొన్ని సంవత్సరాలుగా హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గ్వామ్ మీదుగా కనీసం నాలుగు బెలూన్‌లు కనిపించాయని అమెరికా పేర్కొంది. వీటిలో మూడు ట్రంప్ పరిపాలనలో కనిపించగా.. బైడెన్ పరిపాలనలో ఒక చైనా నిఘా ఎయిర్‌షిప్‌లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది.

ఈ క్రమంలో పెంటగాన్ మంగళవారం నిఘా బెలూన్ చిత్రాల వరుస చిత్రాలను విడుదల చేసింది. అమెరికా, చైనా ప్రెసిడెంట్లు బిడెన్, జిన్ పింగ్ మధ్య జరిగిన మొదటి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశం తరువాత, యుఎస్, చైనాలు తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బెలూన్ సంఘటన మరింత వివాదానికి దారితీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..