AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aero India: లేఆఫ్‌ల మధ్య గుడ్‌న్యూస్‌..! ఈ నెలలో జరగనున్న ఎయిర్‌బస్‌ ఎగ్జిబిషన్‌లో 13 వేలకుపైగా నియామకాలు షురూ..

ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ట్విటర్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, విప్రో, ఇన్ఫోసిస్‌.. వంటి వివిద దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా పరిణమించింది. ఈ క్రమంలో యూరోపియన్ ఏరోస్పేస్ దిగ్గజం..

Aero India: లేఆఫ్‌ల మధ్య గుడ్‌న్యూస్‌..! ఈ నెలలో జరగనున్న ఎయిర్‌బస్‌ ఎగ్జిబిషన్‌లో 13 వేలకుపైగా నియామకాలు షురూ..
Airbus Exhibition
Srilakshmi C
|

Updated on: Feb 08, 2023 | 12:58 PM

Share

ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ట్విటర్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, విప్రో, ఇన్ఫోసిస్‌.. వంటి వివిద దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా పరిణమించింది. ఈ క్రమంలో యూరోపియన్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్‌బస్ తీపికబురు చెప్పింది. ఎయిరో ఇండియాలోని ఇంజినీరింగ్, ఐటీ రంగాల్లో నియామకాల చేపట్టేందుకు ఈ నెలలో బెంగళూరులో పబ్లిక్ మీట్-అండ్-గ్రీట్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెల్పింది. ఇండస్ట్రియల్‌ ర్యాంప్-అప్, దాని ప్రతిష్టాత్మక డీకార్బనైజేషన్ రోడ్‌మ్యాప్, విమానయాన భవిష్యత్తుకు కొత్త నియామకాలు కీలకంగా వ్యవహరిస్తాయని గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ ఎగ్జిబిషన్‌గా పేరుగాంచిన ‘ఏయిరో ఇండియా’ 14వ ఎడిషన్ ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు జరగనుంది. ఎగ్జిబిషన్‌ జరిగే సమయంలో ఆసక్తి కలిగిన అభ్యర్ధులు స్టాండ్‌ నంబర్‌ CR7.1 హాల్‌ సీ వద్ద ఉండే తమ ఎయిర్‌ బస్‌ ఎగ్జిక్యూటివ్‌లను కలుసుని కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకోవచ్చని ఎయిర్‌బస్ ఇండియా దక్షిణాసియా హెచ్‌ఆర్ డైరెక్టర్ సూరజ్ చెత్రీ వివరించారు. అంతేకాకుండా ఎయిర్‌బస్ స్టాల్‌ను సందర్శించేవారు కంపెనీ కమర్షియల్‌ హెలికాప్టర్లు, డిఫెన్స్, స్పేస్‌ పోర్ట్‌ఫోలియోలకు చెందిన ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతికతలు, సర్వీసెస్‌, ఆవిష్కరణలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.