Gujarat: గోవాను మించిన బీచ్ లు.. గుజరాత్ లో ఫేమస్ సముద్రతీర ప్రాంతాలు ఇవే..
ప్రయాణాలను ఇష్టపడే వారు బీచ్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బీచ్‌ను సందర్శించాలని భావించిన వెంటనే గోవా పేరు చాలా మంది మనసులో మెదులుతుంది. అయితే.. దేశంలోని అనేక ప్రాంతాలు వాటి ప్రాధాన్యతను..
ప్రయాణాలను ఇష్టపడే వారు బీచ్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బీచ్‌ను సందర్శించాలని భావించిన వెంటనే గోవా పేరు చాలా మంది మనసులో మెదులుతుంది. అయితే.. దేశంలోని అనేక ప్రాంతాలు వాటి ప్రాధాన్యతను బట్టి ఫేమస్ అయ్యాయి. గోవా బీచ్ ఏడాది పొడవునా పర్యాటకులతో నిండి ఉంటుంది. చాలా మంది టూరిస్ట్‌లు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం నుంచి నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం వరకు గోవాకు వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే.. గోవా సందడికి దూరంగా ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నట్లయితే అలాంటి వారికి గుజరాత్‌లోని అందమైన బీచ్‌లు మంచి ఎగ్జాంపుల్. ఇది గొప్ప ప్రయాణ గమ్యస్థానంగా పేరుగాంచింది. గుజరాత్‌లోని కొన్ని ప్రసిద్ధ బీచ్‌లు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మాండ్వి బీచ్, కచ్: గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న మాండ్వి బీచ్ సూర్యాస్తమయం అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్‌లో తక్కువ రద్దీ కారణంగా.. సముద్రపు నీరు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి కెమెరాలో సూర్యాస్తమయం అద్భుతమైన వీక్షణలను బంధించడమే కాకుండా.. గుర్రం, ఒంటె స్వారీ చేయడం ద్వారా మంచి మెమోరీని పొందవచ్చు.
చౌపట్టి బీచ్, పోర్‌బందర్: గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని చౌపట్టి బీచ్ దేశంలోని పరిశుభ్రమైన బీచ్‌లలో ఒకటి. అహ్మదాబాద్ నుంచి 394 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరుబందర్ కుటుంబ విహారయాత్రలకు ఉత్తమమైనదిగా ప్రసిద్ధి.
మాధవపూర్ బీచ్: మాధవపూర్ బీచ్ అనేక కార్యక్రమాల వేడుకలకు ప్రసిద్ధి చెందింది. బీచ్ సందర్శించడమే కాకుండా సముద్రంలో సరదాగా గడపవచ్చు. ఒంటెల సవారీ, స్థానిక వస్తువుల కోసం షాపింగ్ చేయవచ్చు. గుజరాత్‌లోని ప్రసిద్ధ ఆహారాన్ని రుచి చూడవచ్చు.
సోమనాథ్ బీచ్: సోమనాథ్ నగరం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. కానీ సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న సోమనాథ్ బీచ్ కూడా పర్యాటక ఆకర్షణకు ప్రధాన కేంద్రంగా ఉంది. సోమనాథ్ బీచ్ అందమైన దృశ్యం మీ యాత్రను చిరస్మరణీయం చేస్తుంది.
ద్వారకా: అహ్మదాబాద్ నుంచి 439 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారకాను శ్రీకృష్ణుడి నగరం అని పిలుస్తారు. ద్వారకాధీశుడి ఆలయాన్ని సందర్శించడానికి చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇక్కడి సముద్రపు అలలు, సూర్యాస్తమయ దృశ్యాలు మనసు దోచుకుంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..