Food Poisoning: చికెన్ కబాబ్‌తిని 137 మంది విద్యార్ధులకు ఆశ్వస్థత.. కొందరి పరిస్థితి విషయం..
ఫుడ్ పాయిజన్ కారణంగా 137 మంది హాస్టల్ విద్యార్ధులు ఆసుపత్రిపాలయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆహారం వికటించి అనేక మంది నర్సింగ్, పారామెడికల్ విద్యార్ధినులు వాంతులు, విరేచనాలతో..
ఫుడ్ పాయిజన్ కారణంగా 137 మంది హాస్టల్ విద్యార్ధులు ఆసుపత్రిపాలయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆహారం వికటించి అనేక మంది నర్సింగ్, పారామెడికల్ విద్యార్ధినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతతకు గురైనట్లు పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 7) మీడియాకు తెలిపారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో సిటీ నర్సింగ్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు ఆదివారం రాత్రి ఘీ రైస్, చికెన్ కబాబ్ తిని అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆహారం వికటించి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆశ్వస్థతకు గురైన విద్యార్థినులను హుటాహుటీన మంగళూరులోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించినట్లు నగర పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
శుభ్రత పాటించకపోవడం, కలుషిత నీరు వల్లనే ఫుడ్‌పాయిజన్ అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న విద్యార్ధినుల తల్లిదండ్రులు సోమవారం రాత్రే పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనపై హాస్టల్ యాజమాన్యంపై కద్రి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. హాస్టల్‌లోని మౌలిక వసతుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.