ఈ కలర్ ద్రాక్ష పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Feb 07, 2023 | 8:58 PM

ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. దీంతో చర్మ క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

ఈ కలర్ ద్రాక్ష పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
Grapes

ద్రాక్ష పండ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. ఇందులో ఎరుపు రంగు ద్రాక్షలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు ఒక గిన్నె ఎర్ర ద్రాక్షలను తినడం మీ చర్మం, గుండె ఆరోగ్యం, మెదడు, కళ్ళు, రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర ద్రాక్షలో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. అందుకే చర్మ కాంతిని పెంచడానికి డైటీషియన్లు ఈ ఎర్ర ద్రాక్షలను ఎక్కువగా తినాలని సలహానిస్తుంటారు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి -6, విటమిన్ కె, ఫోలేట్, జింక్, రాగి, పొటాషియం, మాంగనీస్, కాల్షియం లు ఉంటాయి. అంతే కాదు ఇవి క్యాన్సర్, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది.

ఎర్ర ద్రాక్షలను క్రమం తప్పకుండా తింటే మీ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఇమ్యూనిటీ పవర్ మెరుగ్గా ఉంటుంది. దాంతో రోగాల ముప్పు నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎర్ర ద్రాక్ష తొక్కల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. రెస్వెరాట్రాల్ క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఎన్నో ప్రాణాంతక సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు ద్రాక్షలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, నీరు ఉంటుంది. దాంతో మీకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.ఎర్ర ద్రాక్షలు పొటాషియానికి మంచి మూలం. ఈ పొటాషియం మన శరీరంలో సోడియం ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. దీంతో అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ఎర్ర ద్రాక్షలతో తయారు చేసిన వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండె సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ అని పిలువబడే రెండు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎర్ర ద్రాక్ష శరీరంలో ప్లేట్లెట్స్ గడ్డకట్టే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్ సూర్యుని హానికరమైన కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. దీంతో చర్మ క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu