Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారితో పొత్తు పెట్టుకోం.. క్లారిటీ ఇచ్చేసిన సోము వీర్రాజు.. బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటీ..

ప్రత్యేక ప్యాకేజీకి గతంలోనే చంద్రబాబు హయాంలోనే పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చామని.. ఇంకా కొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అడిగితే ఆ డబ్బులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

వారితో పొత్తు పెట్టుకోం.. క్లారిటీ ఇచ్చేసిన సోము వీర్రాజు.. బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటీ..
Somu Veerraju
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 07, 2023 | 7:21 PM

ఇంకా ఎండాకాలం రానేలేదు. కానీ, అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ వేడి రగులుతోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు పరస్పర విమర్శలు, మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. పలు పార్టీల పొత్తులపై కూడా తాజా తాజా అప్‌డేట్స్‌ బయటపడుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఆయన చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడిన ఆయన..”ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నందున పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చామని.. ఇంకొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. కాగా, ప్రత్యేక హోదా విషయమై రాజ్యసభ వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందన్నవిజయసాయిరెడ్డి, పార్లమెంట్‌ తలుపులు మూసి బిల్లు పాస్‌ చేశారని.. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ కూడా మర్చిపోయిందని విమర్శించారు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత బీజేపీదేనని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి గతంలోనే చంద్రబాబు హయాంలోనే పార్లమెంట్ సాక్షిగా 15 వేల కోట్లు ఇచ్చామని.. ఇంకా కొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అడిగితే ఆ డబ్బులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఏపీలో పొత్తులపై కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. జనసేనతోనే పొత్తు ఉంటుందని తెలిపిన ఆయన, చంద్రబాబుతో మాత్రం కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ బీజేపీ వాళ్ళ ఫోన్లు టాపరింగ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఏపీలో రాజధాని కడతామని చంద్రబాబు, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ కుటుంబ రాజకీయ పార్టీలు అయినా వైసీపీ, టీడీపీలతో తాము పొత్తు పెట్టుకోమని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..