Big News Big Debate LIVE : గ్లోబలైజేషనా.? పాలకుల ఫేవరిటిజమా.? అదాని వెనక ప్రధాని ఉన్నారా?

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో అదానీ నామస్మరణతో చర్చలు జరగకుండానే రోజులుగు గడుస్తున్నాయి. NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబానీలు, అదానీలు మాత్రమే బాగుపడ్డారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలకు ఇటీవల వచ్చిన హిండెన్‌ బర్గ్‌ నివేదిక అందివచ్చిన...

Big News Big Debate LIVE : గ్లోబలైజేషనా.? పాలకుల ఫేవరిటిజమా.? అదాని వెనక ప్రధాని ఉన్నారా?
Big News Big Debate
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 07, 2023 | 7:13 PM

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో అదానీ నామస్మరణతో చర్చలు జరగకుండానే రోజులుగు గడుస్తున్నాయి. NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబానీలు, అదానీలు మాత్రమే బాగుపడ్డారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలకు ఇటీవల వచ్చిన హిండెన్‌ బర్గ్‌ నివేదిక అందివచ్చిన ఆయుధంగా మారింది. అంతే ఏమాత్రం అవకాశం వదులుకోకుండా పార్లమెంట్ వేదికగా అదానీ ఆస్తులపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా అదానీ సొంత విమానంలో ప్రయాణించిన మోదీ ఫోటోలను సైతం రాహుల్‌గాంధీ పార్లమెంటులో డిస్‌ప్లే చేశారు.

కొన్నేళ్లుగా గౌతమ్‌ అదాని నిరంతరం వార్తల్లో ఉంటున్నారు. ప్రపంచంలోనే టాప్‌ 2 రిచెస్ట్‌ పర్సన్‌గా మారిన ఇండియన్‌ కూడా ఆయనే. కరోనా సమయంలో అత్యంత వేగంగా సంపద సృష్టించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అదాని ఆస్తులపైనా.. ఎదిగిన తీరుపైనా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల అమెరికాకు చెందిన మార్కెట్ ఎనలిస్ట్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ అదానీపై సంచలన నివేదిక విడుదల చేసింది. అదాని ఆస్తులు పెరగడం వెనక అక్రమాలు ఉన్నాయని.. షేర్లు పెరిగినట్టు చూపించి వాటిని పెట్టి లోన్లు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించారని.. గాలి బుడగే అంటూ నివేదిక ఇచ్చింది. ఒక్కసారిగా ఇది దేశంలో ప్రకంపలు సృష్టించింది. చాలాకాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాయంతోనే అదాని వేగంగా ఎదుగుతున్నారని ఆరోపిస్తున్న విపక్షాలు అస్త్రంగా మలుచుకున్నాయి. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలను కూడా నివేదికపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాల నినాదాలతో దద్దరిల్లుతోంది. అటే దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.

పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీకి ఉన్న సంబంధం ఏమిటని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రశ్నించారు. 2004 నుంచి 2022 వ‌ర‌కు ఆయ‌న ఆస్తులు 8 బిలియ‌న్ల డాల‌ర్ల నుంచి 140 బిలియ‌న్ల డాల‌ర్లకు ఎలా పెరిగాయని రాహుల్ ప్రశ్నించారు. ముంబై ఎయిర్ పోర్టును సైతం సీబీఐ, ఈడీలను ఉపయోగించి జీవీకే నుంచి లాక్కున్నారని రాహుల్‌ ఆరోపించారు. అదానీ ఆస్తులపై హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన నివేదికపై విచారణ జరిపించాలని.. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. హిండెన్‌ బర్గ్‌ నివేదిక వెనక విదేశీ కుట్ర ఉందని గౌతమ్‌ అదాని అంటున్నారు. అటు ప్రభుత్వం దీనిపై ఆచితూచి స్పందిస్తోంది. రెగ్యులేటరీ బాడీస్‌ చూసుకుంటాయని కేంద్ర ఆర్ధిక శాఖ చెబుతోంది. మరి దీనిపై పార్లమెంట్లో ఎలాంటి లాజికల్‌ కన్‌క్లూజన్‌ వస్తుందో చూడాలి.