AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: బీఆర్ఎస్ పాలనలో పాతబస్తీలో అద్భుతమైన అభివృద్ధి.. మంత్రి కేటీఆర్ వెల్లడి..

ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని నలుమూలలా అభివృద్ధి చేయడమే తమ విధానమని తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. పౌరుల అవసరాలే కేంద్రంగా తమ అభివృద్ధి ప్రణాళికలు..

KTR: బీఆర్ఎస్ పాలనలో పాతబస్తీలో అద్భుతమైన అభివృద్ధి.. మంత్రి కేటీఆర్ వెల్లడి..
Ts Minister Ktr
Ganesh Mudavath
|

Updated on: Feb 07, 2023 | 6:49 PM

Share

ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని నలుమూలలా అభివృద్ధి చేయడమే తమ విధానమని తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. పౌరుల అవసరాలే కేంద్రంగా తమ అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ తో పాటు పాతబస్తీ సైతం గత ఎనిమిది సంవత్సరాలలో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్న కేటీఆర్.. పాత బస్తీలో అభివృద్ధి పై అక్బరుద్దీన్ ఓవైసీ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు నుంచి ముందడుగు వేస్తోందని, ఇప్పటికే హైదరాబాద్ నగరం నాలుగు దిశలా విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతోందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం సభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, చెవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి, అధికారులు హాజరయ్యారు.

జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా.. పాతబస్తీ ప్రాంతంలోనూ భారీగా రోడ్డు నెట్ వర్క్ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో ఇప్పటికీ పలు ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వందల కోట్ల నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జనావాసాలు అధికంగా ఉన్న పాతబస్తీలాంటి ప్రాంతాల్లో రోడ్డు వైడనింగ్ కార్యక్రమం కొంత సవాల్ తో కూడుకున్నదని, అయితే రోడ్డు వైడనింగ్ తప్పనిసరి అయినా ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. అవసరమైతే మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్ లతోపాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు.

ప్రతి ఒక్కరికి సరిపడా తాగునీరు అందించాలి. గత 8 సంవత్సరాలలో పాతబస్తీ పరిధిలోను తాగునీరు సరఫరా మెరుగుపడింది. తాగునీటి సౌకర్యాల అభివృద్ది కోసం సుమారు రూ.1200 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఉచిత తాగునీటి సరఫరా పథకంలో భాగంగా పాతబస్తీలో రెండున్నర లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతోంది. పాతబస్తీలో విద్యుత్ సరఫరా వ్యవస్థ అద్భుతంగా మెరుగైంది. ముఖ్యంగా చార్మినార్, చౌమహాల్లా ప్యాలెస్, మదీనా, మక్కా మసీద్, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించాం. వైద్య ఆరోగ్య రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాల అమలుతో పాటు, ప్రత్యేకంగా 84 బస్తి దావాఖానాలను ఇప్పటిదాకా పాతబస్తీలో ఏర్పాటు చేశాం. మీర్ ఆలం ట్యాంక్ పైనుంచి ఆరు లైన్ల కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనలు సైతం డిపిఆర్ దశలో ఉన్నాయి.     

ఇవి కూడా చదవండి

     – కేటీఆర్, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం