ఫాఫం.. ఎంతో ఆశపడి విమానంలో విండో సీట్ బుక్ చేసుకున్నాడు.. కట్ చేస్తే దారుణమైన మోసం..

వాళ్లు కూడా తమకేమీ తెలియదని చెప్పటంతో అతనికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది..కానీ, ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు.. దీంతో తనకు జరిగిన దానిపై సోషల్ మీడియాలో ఒక ట్విట్‌ చేశాడు.

ఫాఫం.. ఎంతో ఆశపడి విమానంలో విండో సీట్ బుక్ చేసుకున్నాడు.. కట్ చేస్తే దారుణమైన మోసం..
British Airlines
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 07, 2023 | 5:53 PM

విమాన ప్రయాణ ఓ అద్భుతమైన అనుభవం..విమానంలో విహరిస్తుండగా మేఘాలు, దిగువ ప్రకృతి దృశ్యాన్ని చూడటం ప్రశాంతమైన, అందమైన అనుభూతిని కలిగిస్తుంది. సుదీర్ఘ విమాన ప్రయాణంలో సమయాన్ని వ్యూస్ చూస్తూ ఎంజాయ్‌ చేయడానికి, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రతి అరుదైన దృశ్యాన్ని క్యాప్చర్‌ చేసుకుంటుంటారు చాలా మంది ప్రయాణికులు. అయితే, ఈ ప్రయోజనాలు పొందాలంటే.. విండో సీటు ఉండాల్సిందే. అయితే, విమానంలో విండో సీటు కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి మరీ టికెట్‌ కొనుగోలు చేసిన ఓ ప్రయాణికుడికి ఊహించని షాక్‌ తగిలిండి..అదనపు ధరతో టికెట్‌ కొనుకున్నప్పటికీ అతనికి విండో సీటు రాలేదు. దాంతో అతడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

అనిరుద్‌ మిత్తల్‌ అనే ప్రయాణికుడు లండన్‌ వెళ్లేందుకు బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అద్భుత వ్యూ కోసం విండో సీట్‌ కోరుకున్నాడు. ల్యాండింగ్‌ సమయంలో వ్యూ బాగుంటుందని విమానం కుడివైపు విండో సీట్‌ను బుక్‌ చేసుకున్నాడు. తీరా, విమానం ఎక్కేసరికి అక్కడ కిటీకి లేదు.. మొత్తం మూసేసి ఉంది. అనిరుద్‌ సీటుకు వెనుకవైపు, ముందువైపు రెండు సీట్లకూ విండో వెసిలిటీ ఉంది..కానీ, తనకు కేటాయించిన సీటుకు మాత్రం విండో లేదు.. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు వెంటనే విమాన సిబ్బందిని నిలదీశాడు. అక్కడ విండో ఉండదని తెలిసి కూడా టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించాడు. వాళ్లు కూడా తమకేమీ తెలియదని చెప్పటంతో అతనికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది..కానీ, ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు.. దీంతో తనకు జరిగిన దానిపై సోషల్ మీడియాలో ఒక ట్విట్‌ చేశాడు. తన సీటును ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

ఇవి కూడా చదవండి

విమానంలో విండో సీట్‌ కోసం టికెట్‌ ధర కంటే ఎక్కువగానే చెల్లించానని చెప్పాడు. కానీ, తనకు మాత్రం విండో పక్క సీటు రాలేదంటూ ఆ ఫోటోకి క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఫోటో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో తనకు కూడా ఇలాగే జరిగిందంటూ పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..