సామర్లకోటలో దారుణం.. మానసిక వికలాంగురాలిపై గత కొన్ని నెలలుగా అత్యాచారం.. చివరకు..

మరోవైపు, తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిసి.. అప్పన్న తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టుగా తల్లి ఆరోపించింది. తమకు..

సామర్లకోటలో దారుణం.. మానసిక వికలాంగురాలిపై గత కొన్ని నెలలుగా అత్యాచారం.. చివరకు..
Rape
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 07, 2023 | 3:34 PM

మానసిక వికలాంగురాలిని మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పది రోజుల క్రితమే బాధితురాలి తల్లి స్థానిక.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు కిచకుడు అప్పన్న పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

సామర్లకోట మండలం వేట్లపాలెం లో మానసిక వికలాంగురాలిపై లక్కిరెడ్డి అపన్న అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా అత్యాచారం సాగిస్తున్నాడని ఆలస్యంగా గుర్తించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం బాధితురాలు ఐదు నెలల గర్భవతి అని ఆమె తల్లి వాపోయింది. బాధితురాలిని వెంటపెట్టుకుని సామర్లకోట పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేసింది తల్లి. కానీ, ఫిర్యాదు చేసి 10 రోజులైనప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

మరోవైపు, తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిసి.. అప్పన్న తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టుగా తల్లి ఆరోపించింది. తమకు 10వేల రూపాయలు ఇచ్చి గర్భం తీయించాలని కాళ్ళు పట్టుకున్నాడని చెప్పింది బాధితురాలి తల్లి. తమకు ఎలాగైన న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..