నెల్లూరులో మూడేళ్ల బాలుడు మిస్సింగ్ మిస్టరీ.. 18 నెలల తర్వాత ఊహించని రీతిలో.. ఏం జరిగిందో తెలుసా..?
పిల్లాడు కనిపించక పోవడంతో ఆందోళన పడిన తల్లి చుట్టుపక్కల అంతా వెతికింది.. అయితే మిస్ అయిన సంజయ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లాడని కొందరు చెప్పడంతో స్థానికులతో కలిసి వెతికినా ప్రయోజనం లేక పోయింది...దీంతో పొలుసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు..
18 నెలల క్రితం కనిపించకుండా పోయిన ఐదేళ్ల బాలుడు అనుకోకుండా ఆ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కనిపించకుండా పోయిన బిడ్డ కోసం కన్నీళ్లు ఆవిరైపోయేలా ఏడ్చిన ఆ తల్లిదండ్రులు.. ఇక ఎప్పటికి తమ కొడుకు తిరిగి రాడనుకుని ఆశలు వదిలేసిన సమయంలో ఆ చిన్నారి..అనుకోని విధంగా ఆ తల్లితండ్రుల వద్దకు చేరాడు. దాంతో ఆ అమ్మనాన్నల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక రాడు అనుకున్న ఐదేళ్ల బాలుడు 18 నెలల తరువాత సినీ ఫక్కీలో తల్లిదండ్రుల చెంతకు చేరాడు…ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి లో జరిగింది. ఈ విచిత్ర ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
అది 2021 జులై నెల 2వతేది ఉయ్యాలపల్లి గ్రామంలో జాతర జరుగుతుంది…. జాతర చూసేందుకు తోటిపిల్లలతో వెళ్లిన బుజ్జయ్య, వరలక్ష్మి ల మూడేళ్ళ చిన్నారి దండు సంజయ్ కనిపించకుండా పోయాడు..పిల్లాడు కనిపించక పోవడంతో ఆందోళన పడిన తల్లి చుట్టుపక్కల అంతా వెతికింది.. అయితే మిస్ అయిన సంజయ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లాడని కొందరు చెప్పడంతో స్థానికులతో కలిసి వెతికినా ప్రయోజనం లేక పోయింది…దీంతో పొలుసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు.. అసలే వెలుగొండలో క్రూర మృగాలు సంచరించే ప్రదేశం. అయినప్పటికి పోలీసులు డ్రోన్, డాగ్ స్క్వా డ్ సాయంతో వెలుగొండలు జల్లెడ పట్టారు. రోజులు గడుస్తున్నా చిన్నారి సంజు ఆచూకీ మాత్రం తెలియ రాలేదు…ఓ వైపు పోలీసులు, మరో వైపు మీడియా, స్థానికులు అందరూ కలిసి సంజు కోసం చేయని ప్రయత్నం లేదు. నెలలు గడిచాయి. కానీ సంజు ఆచూకి తెలియలేదు…దీంతో అందరూ ఇంక సంజు లేడు అనుకున్నారు. చివరికి తల్లిదండ్రులు కూడా సంజు పై ఆశ వదిలేసుకున్నారు.. కానీ ఆ తల్లి కన్నీరు, కన్న ప్రేమ ఆ బిడ్డను అతల్లి వద్దకు చేర్చింది.
ఉయ్యాలపల్లి లో మిస్ అయిన సంజు ని కడప జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు ఎత్తుకెళ్లాడు తనతో పాటు కడప జిల్లాకు తీసుకువెళ్లాడు. మద్యం కి డబ్బు లేక పోవడంతో కేవలం 200 రూపాయలకు అక్కడి ఇటుక బట్టి కార్మికులకు సంజు ను అమ్మేశాడు ఆ వృద్ధుడు…అయితే నెలలు గడుస్తున్నా సరిగా మాటలు కూడా రాని సంజు వాళ్ళ దగ్గర వాళ్ళ బిడ్డగానే వున్నాడు. అయితే తాజాగా కడప జిల్లా ఇటుక బట్టికి చెందిన కార్మికులు పనుల కోసం కలువాయి మండలం తోపుగుంటకు వచ్చారు… అయితే వారితో పాటు సంజు ను కూడా తీసుకునిరావడంతో సంజు ని చూసిన కొందరు అనుమానం రావడంతో ఆరా తీశారు. దీంతో భయపడిన ఇటుక కార్మికులు సంజు ని తీసుకుని మరొక చోటుకు వెళ్లిపోయారు. అయితే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వారి దగ్గరికి వెళ్లడంతో చివరికి సంజు ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సరిగ్గా 18 నెలల క్రితం కనిపించకుండా పోయిన కుమారుడు తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరడంతో ఆ తల్లిదండ్రులు ఆనందానికి అంతు లేకుండా ఉంది.
ఇక రాడు, లేడు అనుకున్న చిన్నారి సంజు తల్లిదండ్రుల వద్దకు వచ్చాడని గ్రామంలో తెలియడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సంజు ని చూసేందుకు వచ్చారు. 18 నెలలుగా కనిపించకుండా పోయిన సంజు తోటి స్నేహితులు ఇంటికి చేరుకుని సంజును చూసి సంబరపడి పోతున్నారు…అయితే సంజు మిస్సింగ్ కేసు ఇంకా పెండింగ్ లో ఉందని సంజు తిరిగి తల్లిదండ్రుల వద్దకు రావడంతో సంజు కేసు మరోసారి విచారణ జరుపుతామని అన్నారు రాపూరు సి ఐ కోటేశ్వరరావు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..