Pawan Kalyan: సీఎం జగన్‏కు ఆ అవార్డు ఇవ్వాలి.. జనసేనాని పవన్ కల్యాణ్ సెటైర్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పై జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయని విమర్శించారు....

Pawan Kalyan: సీఎం జగన్‏కు ఆ అవార్డు ఇవ్వాలి.. జనసేనాని పవన్ కల్యాణ్ సెటైర్..
Pawan Kalyan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 07, 2023 | 5:42 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పై జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయని విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.55,555 కోట్లకు చేరుకుందని ఫైర్ అయ్యారు. అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎద్దేవా చేశారు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించాలని వ్యంగ్యంగా సూచించారు. వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంపదను వదిలేయండి. భారతరత్న లాగా మీకు అప్పురత్న అవార్డు ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. ఏపీ సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ గతంలో తీవ్ర విమర్శలు చేశారు. ధనిక సీఎం పాలనలో రాష్ట్రం పేదరికంలో మిగిలిపోయిందని ఆక్షేపించారు. మన ముఖ్యమంత్రి సంపాదన దేశంలోనే మిగతా సీఎంల కంటే ఎక్కువ సంపాదన అని.. అసలు దేశంలో జగన్ క్లాసే వేరంటూ సెటైర్లు విసిరారు. వైసీపీ రాజ్యంలో ప్రజలందర్నీ బానిసలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు.. ఇదో మాస్టర్ క్లాస్ అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..