ప్రభుత్వ పాఠశాల స్లాబ్ పెచ్చులు ఊడి.. విద్యార్థులకు తీవ్ర గాయాలు..

ఉపాధ్యాయులు హుటాహుటినా స్పందించి చిన్నారులను 108 ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ పాఠశాల స్లాబ్ పెచ్చులు ఊడి.. విద్యార్థులకు తీవ్ర గాయాలు..
Students Injured
Follow us

|

Updated on: Feb 07, 2023 | 7:57 PM

విశాఖ జిల్లాలో పెను ప్రమాదం సంభవించింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చకునిపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై స్లాబ్‌ కూలిపడింది. తరగతి గదిలో చదువుకుంటున్న పిల్లలపై స్లాబ్ పెచ్చులు వూడి పడ్డాయి. ఈప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలు కాగా వారిలో ఒక విద్యార్ధిని తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది. ఉపాధ్యాయులు హుటాహుటినా స్పందించి చిన్నారులను 108 ద్వారా విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన విద్యార్థులు ఒకటో తరగతి చదువుతున్న తాలాడ వేదశ్రీ నుదురికి బలమైన గాయం తగిలింది. మూడో తరగతి చదువుతున్న తాలాడ ప్రేమచంద్ గాయలపాలయ్యాడు. ఒకటో తరగతి చదువుతున్న పి నిత్యశ్రీ స్వల్ప గాయాలపాలైంది. ఇదిలా వుండగా పాఠశాల భవనానికి ఇటీవలే మరమ్మత్తులు చేయించామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు 1 వరకు 3 వరకూ ఒకే గదిలో తరగతులను నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది.

గతంలోనూ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబు కూలి విద్యార్థి మృతి చెందాడు. పాఠశాల ప్రాంగణంలో ఆడుకునేందుకు వెళ్లిన విద్యార్థులపై ఒక్కసారిగా భవనం పైకప్పు కూలడంతో విష్ణు అనే విద్యార్థి మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..